Don't Miss!
- News
భారత్ బయోటెక్ నుంచి కొత్త వ్యాక్సిన్ వచ్చేసింది- అక్కడే అందుబాటులో
- Lifestyle
సెక్స్ సమయంలో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే, సెక్స్ సమయంలో మీ భర్త లేదా ప్రియుడికి చెప్పవలసిన కొన్ని విషయాలు
- Sports
INDvsAUS : మాజీ ఆసీస్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే సమాధానం.. నోటమాట రాలేదుగా!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Balakrishna Veera Simha Reddyకి సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్.. ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే?
సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణను బాలయ్య బాబు అని ముద్దుగా పిలిచుకుంటారు ఆయన అభిమానులు. అంతేకాకుండా బాలకృష్ణ నుంచి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఓ సినిమా వస్తుందంటే చాలు సినిమాపై అంచనాలే కాకుండా అభిమానుల్లో బీభత్సమైన క్యూరియాసిటీ నెలకొంటుంది. ఫ్యాన్స్ క్యూరియాసిటీ, అంచనాలకు అనుగుణంగా సినిమా తెరకెక్కితే ఇప్పుడు తాజాగా సెన్సార్ బోర్డ్ కూడా అదే తేల్చి చెప్పేసింది. బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాకు సెన్సార్ బోర్డ్ ఇచ్చిన రిపోర్ట్ వివరాల్లోకి వెళితే..

హిట్ సినిమాలతో ఫుల్ జోష్ గా..
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల అఖండ సినిమాతో బాలకృష్ణ, క్రాక్ మూవీతో గోపిచంద్ మలినేని సూపర్ జోష్ లో ఉన్నారు. ఇక వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే టాపిక్ రాగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన షూటింగ్ స్పాట్ పిక్స్, వీడియోలు, పాటలు తెగ వైరల్ అయ్యాయి.

మరోసారి ద్విపాత్రాభినయం..
ఇక వీర సింహారెడ్డి టైటిల్ పోస్టర్, నందమూరి నటసింహం బాలకృష్ణ గెటప్, టీజర్, సుగుణ సుందరి, జై బాలయ్య, మా బావ మనోభావాలు పాటలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. జనవరి 9న మాస్ మొగుడు అనే మరో స్పెషల్ మాస్ నంబర్ ను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య బాబు మరోసారి ద్విపాత్రాభినయం చేసిన వీర సింహా రెడ్డి చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

3 గంటలకు పైగా అనుకున్నా..
బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాకు సంబంధించిన అన్ని రకాల పనులు కూడా పూర్తయ్యాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు సినిమాను తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వీరసింహా రెడ్డి ఫైనల్ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా అయితే మూడు గంటలకు పైగా రన్ టైమ్ అనుకోగా ఆ తర్వాత డైరెక్టర్ గోపించంద్ ఎడిటర్ తో చర్చించి ఫైనల్ రన్ టైమ్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
|
కావాల్సినంత ఎంటర్టైన్ మెంట్..
ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ బోర్ట్ రిపోర్ట్ ఇచ్చింది. గోపిచంద్ మలినేని-బాలకృష్ణ తొలి కాంబినేషన్ మూవీ వీర సింహా రెడ్డికి క్లీన్ యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ చిత్రం పూర్తిగా బాలకృష్ణ మార్క్ మూవీగా వచ్చిందని.. అభిమానులకు ఈ సినిమాతో కావాల్సినంత ఎంటర్టైన్ మెంట్ ను బాలయ్య బాబు ఇవ్వబోతున్నట్లు సెన్సార్ బోర్డ్ తెలిపింది.

హైలెట్ కానున్న యాక్షన్ సీక్వెన్స్..
పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన వీర సింహా రెడ్డి సినిమాలో మొత్తంగా 11 ఫైట్స్ హైలెట్ కాబోతున్నాయట. ఫస్ట్ హాఫ్ లో ఎవరు ఊహించని స్థాయిలో 4 ఫైట్స్ ఉంటాయని సమాచారం. ముఖ్యంగా బాలయ్య బాబు ఎంట్రీ ఇచ్చే విధానం కూడా థియేటర్లో గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. ఇక మొదటి హాఫ్ లోనే మూడు పాటలు హైలెట్ కానున్నాయట. జై బాలయ్య పాట విజువల్స్ సైతం ఫ్యాన్స్ ను విజిల్స్ వేయించే విధంగా ఉంటుందని సినీ వర్గాల నుంచి సమాచారం.

గత చిత్రాల తరహాలోనే..
ఇక గోపిచంద్ మలినేని తన మిగతా సినిమాల్లో చూపించినట్లుగానే ఇందులో కూడా విలన్ ను తన మార్క్ కు తగినట్లుగా, చాలా పవర్ ఫుల్ గా చూపించనున్నట్లు టాక్. ఇక ఈ సినిమా టెంప్లేట్ అయితే బాలకృష్ణ గత సినిమాలకు తగ్గట్లుగా రెగ్యులర్ గానే ఉంటుందని సమాచారం. చెన్న కేశవరెడ్డి, సింహా, లెజెండ్, అఖండ వంటి రెగ్యులర్ డబుల్ రోల్స్ తరహాలోనే వీర సింహా రెడ్డి ఉంటుదని భోగట్టా. ఈ స్టైల్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా విజయం సాధించిన విషయం తెలిసిందే.