Don't Miss!
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- News
బీజేపీలో టీడీపీ స్లీపర్ సెల్స్: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి కాల్ రికార్డ్స్‌పై సజ్జల క్లారిటీ
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Sports
Ranji Trophy 2023: ముగిసిన ఆంధ్ర పోరాటం.. క్వార్టర్స్‌లో తప్పని ఓటమి!
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Balakrishna 'వీర సింహా రెడ్డి' నుంచి మరో క్రేజీ న్యూస్.. దీంతో అభిమానులకు పూనకాలే!
సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణను బాలయ్య బాబు అని ముద్గుగా పిలిచుకుంటారు. అంతేకాకుండా బాలకృష్ణ నుంచి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఓ సినిమా వస్తుందంటే చాలు సినిమాపై అంచనాలే కాకుండా అభిమానుల్లో బీభత్సమైన క్యూరియాసిటీ నెలకొంటుంది. ఇందుకు ఉదాహరణే తాజాగా బావగారి మనోభావాలు సాంగ్ లాంచ్ కి భారీగా ఫ్యాన్స్ హాజరుకావడం. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు తాజా చిత్రం వీర సింహా రెడ్డికి సంబంధించిన కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆ వివరాల్లోకి వెళితే..

టైటిల్ పోస్టర్ నుంచి సాంగ్స్ వరకు..
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల ఇటు బాలకృష్ణ అఖండ సినిమాతో, అటు గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే టాపిక్ రాగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన షూటింగ్ స్పాట్ పిక్స్, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇక వీర సింహారెడ్డి టైటిల్ పోస్టర్, నందమూరి నటసింహం బాలకృష్ణ గెటప్, టీజర్, సుగుణ సుందరి, జై బాలయ్య పాటలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

స్పెషల్ సాంగ్ రిలీజ్..
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'వీర సింహా రెడ్డి' సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ను ఇప్పటికే మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేసింది. ఈ క్రమంలోనే దీని నుంచి స్పెషల్ నెంబర్ 'మా బావ మనోభావాలు' అనే సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది. ఇందుకోసం హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో స్పెషల్ ఈవెంట్‌ను కూడా నిర్వహించింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..
ఇక
సినిమా
విడుదలకు
ముందు
అట్టహాసంగా
జరిగేది
ఆ
మూవీ
ప్రీ
రిలీజ్
ఫంక్షన్.
అందుకోసం
భారీగా
ఏర్పాట్లు
చేస్తారు
మేకర్స్.
ఇక
బాలకృష్ణ
వంటి
స్టార్
హీరోకు
ఉన్న
అభిమాన
గనాన్ని
దృష్టిలో
పెట్టుకుని
అంతకుమించి
ఉండేలా
ఏర్పాట్లు
చేస్తారు.
అయితే
ఇప్పుడు
ఈ
ప్రీరిలీజ్
ఈవెంట్
కు
సంబంధించి
క్రేజీ
అప్డేట్
ఇచ్చారు
మేకర్స్.
మాస్
డైరెక్టర్
గోపీచంద్
మలినేని
దర్శకత్వంలో
మాస్
కా
బాప్
బాలకృష్ణ
కాంబినేషన్
లో
తొలిసారిగా
వస్తున్న
వీర
సింహా
రెడ్డి
సినిమా
ప్రీ
రిలీజ్
ఈవెంట్
ను
జనవరి
6న
ఒంగోలులో
నిర్వహించనున్నారు.
అంతేకాకుండా
ఈ
ఈవెంట్
కు
ముఖ్య
అతిథిగా
మెగాస్టార్
చిరంజీవి
రానున్నాడని
ఓ
వార్త
చక్కర్లు
కొడుతోంది.
ఇదే
నిజమైతే
అభిమానులకు
పూనాకాలు
తెప్పించినట్లేనని
సినీ
వర్గాలు
అనుకుంటున్నాయి.

కీలక పాత్రల్లో స్టార్స్..
ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రంలో బ్యూటిఫుల్ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అఖండ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.