Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Balakrishna వీర సింహా రెడ్డి నుంచి క్రేజీ అప్డేట్.. బాలయ్య మాస్ ఎనర్జీ చూడండి అంటూ!
నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ పై వేటకు సిద్ధమయ్యాడు. ఇటీవల అఖండ మూవీతో సాలిడ్ హిట్ కొట్టిన బాలయ్య బాబు మరోసారి వేట ప్రారంభించనున్నాడు. క్రాక్ చిత్రంతో సూపర్ సక్సెస్ సాధించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన చిత్రం వీర సింహా రెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదిని ఇటీవల ప్రకటించగా తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను వదిలారు దర్శకనిర్మాతలు. ఆ వివరాల్లోకి వెళితే..
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల ఇటు బాలకృష్ణ అఖండ సినిమాతో, అటు గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే టాపిక్ రాగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన షూటింగ్ స్పాట్ పిక్స్, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇక వీర సింహారెడ్డి టైటిల్ పోస్టర్, నందమూరి నటసింహం బాలకృష్ణ గెటప్, టీజర్ అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే బాలకృష్ణ సినిమాలకు సింహా అనే టైటిల్ ఉండటం సెంటిమెంట్ గా ఉంది. సింహా అనే టైటిల్ తో వచ్చిన సినిమాలన్ని దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ వీర సింహా రెడ్డిలో కూడా అదే టైటిల్ ఉండటంతో సెంటిమెంట్ ప్రకారం సూపర్ హిట్ అవుతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. టైటిల్ మాత్రమే కాకుండా సినిమాలో కూడా కంటెంట్ ఉంటుందని, గోపీచంద్ దర్శకత్వ పటిమ గురించి తెలిసిందేనని చర్చించుకుంటున్నారు. బాలకృష్ణ 107వ సినిమా వీర సింహా రెడ్డి చిత్రాన్ని జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇప్పుడు తాజాగా వీర సింహా రెడ్డి సినిమా కొత్త అప్డేట్ ను ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇదివరకే ఈ సినిమా నుంచి వదిలిన జై బాలయ్య పాట ఎంత ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమా నుంచి మరో సింగిల్ ను విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. "వీర సింహా రెడ్డి సెకండ్ సింగిల్ సాంగ్ సుగుణ సుందరి డిసెంబర్ 15న విడుదల కానుంది. ఈ పాటలో బాలయ్య మాస్ ఎనర్జీని చూడండి" అని ట్వీట్ చేసింది. అంటే ఈ సాంగ్ హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మరోసారి ఈ పాటతో తమన్ మ్యూజిక్ హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది.