Don't Miss!
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Veera Simha Reddy: బాలయ్య సినిమా రన్ టైం లీక్.. ఏకంగా అన్ని గంటలు ఊచకోత
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ అదే పంథాను ఫాలో అవుతోన్న ఆయన.. గత ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ హిట్ 'అఖండ' తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. దీంతో వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను మొదలు పెడుతున్నారు. ఇలా ఇప్పటికే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే యాక్షన్ మూవీని చేస్తున్నారు.
Bigg Boss Winner: ఫినాలే వీక్‌లో షాకింగ్ ఓటింగ్.. అతడికే అన్ని ఓట్లా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరంటే!
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'వీరసింహారెడ్డి' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఇది శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న 'వీరసింహారెడ్డి' మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ తాజాగా పూర్తైనట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రానికి ఫైనల్‌గా 2 గంటల 43 నిమిషాల నిడివితో రాబోతుందని తెలిసింది. సాధారణ రన్ టైం కంటే కాస్త ఎక్కువగానే ఉన్నా ప్రేక్షకులను రంజింపజేసేలా ఇందులో స్టఫ్‌ను చూపించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో దాదాపు 60 నిమిషాలకు పైగానే యాక్షన్ సీక్వెన్స్‌లను పెట్టారని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక, ఈ మూవీ త్వరలోనే సెన్సార్‌కు వెళ్లబోతుందని సమాచారం.
మరోసారి హద్దు దాటిన కేతిక శర్మ: బెడ్‌పై ఆ బాడీ పార్టులు కనిపించేలా!
'వీరసింహారెడ్డి' మూవీలో బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఇది జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది.