twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ మూవీ వివాదం: తాతలు వచ్చినా నన్నేమి చేయలేరు.. నిర్మాత అంబికా కృష్ణకు దర్శకుడి వార్నింగ్

    |

    2005లో బాలకృష్ణ నటించిన వీరభద్ర సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. విడుదలకు ముందు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిన ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో నిర్మాత నష్టపోవాల్సి వచ్చింది. అయితే 16ఏళ్ళ అనంతరం ఆ సినిమాకు సంబంధించిన గొడవ చర్చల్లోకి వచ్చింది. దర్శక నిర్మాతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

    యజ్ఞం హిట్టు తరువాత

    యజ్ఞం హిట్టు తరువాత

    గోపిచంద్ యజ్ఞం సినిమా తరువాత డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి పేరు అప్పట్లో మారుమ్రోగిపోయింది. మహేష్ బాబు వంటి స్టార్స్ తో కూడా చర్చలు జరిపారు. అయితే ముందుగా అంబికా కృష్ణ అడ్వాన్స్ ఇవ్వడం వలన ఆయనతోనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. బాలయ్య కూడా కథ చెప్పగానే ఒప్పేసుకున్నారు.

     వీరభద్ర షూటింగ్ లో గొడవలు

    వీరభద్ర షూటింగ్ లో గొడవలు

    వీరి కాంబినేషన్ లో వచ్చిన వీరభద్ర సినిమా అప్పట్లో అభిమానుల్లో అంచనాల డోస్ ను పెంచేసింది. అయితే విడుదల తరువాత మాత్రం ఎవరు ఊహించని రిజల్ట్ ను అందుకుంది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో కొన్ని గొడవలు జరిగినట్లు నిర్మాత అంబికా కృష్ణ ఇటీవల కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

    బాలయ్య కూడా అరిచేశారు

    బాలయ్య కూడా అరిచేశారు


    నిర్మాత అంబికా కృష్ణ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరభద్ర దర్శకుడు రవికుమార్ చౌదరి తాగి సెట్ కు వచ్చేవాడని చెప్పారు. ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం దర్శకుడే అంటూ అనవసరమైన ఖర్చులు చాలా పెట్టించాడని కామెంట్ చేశారు. చాలాసార్లు గొడవ అయ్యిందని, బాలయ్య కూడా అతనిపై అరిచేశారని మండిపడ్డారు.

    స్పందించిన దర్శకుడు

    స్పందించిన దర్శకుడు

    అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రవికుమార్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు ఎంతో మంది సీనియర్ నిర్మాతలతో రెండు మూడుసార్లు వర్క్ చేశానని తన క్యారెక్టర్ పై ఇలా అపనిందలు వేయడం కరెక్ట్ కాదని అన్నారు. నేను అంత చెడ్డవాడిని అయితే ఒకసారి వర్క్ చేసిన ప్రొడ్యూసర్ మరోసారి నాతో ఎందుకు సినిమా చేస్తాడు? అని ప్రశ్నించారు.

    నేను తాగి వస్తే బాలకృష్ణ ఊరుకుంటారా?

    నేను తాగి వస్తే బాలకృష్ణ ఊరుకుంటారా?

    వీరభద్ర సినిమా విషయంలో నిర్మాత నుంచి కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయని చాలా విషయాల్లో మోసం జరిగిందని అన్నారు. షూటింగ్ సమయాల్లో అడిగినట్లుగా కూడా సహకరించలేదని చెప్పారు. ఇక నేను తాగి సెట్ కు వస్తే బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ హీరో ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

    తాతలు వచ్చినా కూడా..

    తాతలు వచ్చినా కూడా..

    అనవసరంగా ఈ గోడవను ఇప్పుడు ఎందుకు లాగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అంబికా కృష్ణ గారు అంటే నాకు చాలా గౌరవం. అయితే నాపై ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తే సైలెంట్ గా ఉండలేను. మీ తాతలు వచ్చినా కూడా నన్ను ఏమి చేయలేరు అంటూ ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్లకే స్థానం ఉంటుందని అన్నారు.

    English summary
    In 2005, the movie Veerabhadra starring Balakrishna received a bad result at the box office. The film, which created a huge buzz before its release, did not live up to expectations. The producer had to lose out. However, after 16 years, the controversy surrounding the film came up for discussion. Bullets of words are exploding between the producers of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X