For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bandla Ganesh : MAA బిల్డింగ్‌ ఎందుకు.. ఎవరి కోసం?.. అది కాకుండా ఇవి కట్టిస్తే ఆ కిక్కే వేరు!

  |

  తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం వాడీవేడిగా సాగుతోంది. నిజానికి ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటిదాకా విడుదల కాలేదు కానీ ఎన్నికల వ్యవహారం తెర మీదకు వచ్చి నప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి. అసలు ఎప్పుడూ ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చని ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు మద్దతుగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  పోటాపోటీ

  పోటాపోటీ

  ఎప్పుడో ఏర్పాటు చేయబడిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి ఈ మధ్యకాలంలో గట్టి పోటీ నెలకొంది.. గత ఎన్నికల్లో అయితే శివాజీ రాజా నరేష్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో శివాజీ ప్యానల్ గెలుపొందగా నరేష్ మాత్రం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నరేష్ ఎన్నికైనప్పటి నుంచి దాదాపు కరోనా మహమ్మారి ఎంటర్ కావడంతో ఆయన పెద్దగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున చేసిన పనులు ఏవీ లేవు.. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ప్రకాష్ రాజ్ ఒక లేఖ రాసి ఎప్పుడు ఎన్నికలు ఉండవచ్చు అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని ప్రశ్నించారు.

  ఏకంగా ఐదుగురు

  ఏకంగా ఐదుగురు

  ఈ వ్యవహారం చాలా లేటుగా బయటకు తెలిసింది. కానీ తెలిసినప్పటి నుంచి పెద్ద ఎత్తున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహారం వార్తల్లో నిలుస్తోంది. ఏకంగా నలుగురు రంగంలోకి దిగుతామని ప్రకటించడం కలకలం రేపింది. దానికి తగ్గట్టు అసలు ఎప్పుడూ యాక్టివ్ గా ఉండని వెంకట్రావు అనే నటుడు సైతం తెలంగాణ వాదంతో బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అన్నీ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ చుట్టూ తిరుగుతున్నాయి.

  అసోసియేషన్ బిల్డింగ్ చుట్టూ

  అసోసియేషన్ బిల్డింగ్ చుట్టూ

  గతంలో పోటీ చేసిన వారు ఇప్పుడు పోటీ చేస్తున్న వారు కూడా ముఖ్యంగా అసోసియేషన్ బిల్డింగ్ మాట మీద ఎన్నికలకు వెళుతున్నారు. అయితే అసలు ఈ బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదంటున్నారు బండ్ల గణేష్. తాను బిల్డింగ్ కట్టడం విషయంలో వ్యతిరేకినని ఎందుకంటే దాని కంటే ముందు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని అన్నారు. 900 మంది సభ్యులు ఉన్న మా అసోసియేషన్ లో దారిద్ర్యరేఖకు దిగువన 150 మంది దాకా ఉన్నారని వాళ్ళు సరైన ఆర్థిక స్తోమత లేక ప్రతి నెల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

   ఆ కిక్కే ఎలా ఉంటుందో

  ఆ కిక్కే ఎలా ఉంటుందో

  మా బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేస్తాము లేదా చేయబోతున్నాము అనుకుంటున్న 20 కోట్లకు మరో పది కోట్లు కలిపి ఆ పేద కళాకారులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇస్తే ఎంతో బాగుందని ఇలాంటి పని అంటే మన స్టార్ హీరోలు సైతం ముందుకు వస్తారని ఆయన అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు అని పేర్కొన్న బండ్ల గణేష్ ఆ బిల్డింగ్ లేనందువల్ల సినిమా షూటింగ్ లు ఆగవని అలాగే సినిమాలు చూసే వాళ్ళు కూడా తగ్గరని అన్నారు. ఒక వంద మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఫ్రీగా ఇస్తే ఆ కిక్కే ఎలా ఉంటుందో ఆలోచించాలని కూడా బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  ప్రకాష్ రాజ్ కి సపోర్ట్

  ప్రకాష్ రాజ్ కి సపోర్ట్

  ఇక తాను ఈ ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నట్లు గా బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్ కూడా ముందు నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ మంచు విష్ణు మాత్రం బిల్డింగ్ ఖర్చయ్యేది మొత్తం భరిస్తామని ప్రకటన చేశారు. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం సాగనుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

  English summary
  Actor Bandla Ganesh About Shcoking Comments Maa Association Building.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X