పవన్ పేరు మార్చిన బండ్ల, ఈరోజు నుంచి అలానే పిలుస్తా.. అంటూ ఆసక్తికర ట్వీట్!

ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగిగా కెరీర్ మొదలు పెట్టి ఈరోజు పెద్ద ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాడు బండ్ల గణేశ్‌. కమెడియన్‌గా అవకాశాలు తగ్గిన సమయంలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో తనకు అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత క్రేజ్ వచ్చిందో తెలియదు కానీ రాజకీయాల్లోకి వచ్చి కొన్ని కామెంట్స్ చేసి అంతకంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏకంగా ఆయనకు సెవనో క్లాక్ గణేష్ అనే పేరు కూడా పెట్టినా ఇప్పుడు కాస్త జనం ఆ పేరు మర్చిపోయారు. అలా ఆయనకు సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెరిగింది.

Bandla Ganesh changes Power star pawan kalyans name to devara

అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారింది. బండ్ల గణేష్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూనే ఉంటారు. పవన్ ను తన దేవుడిగా సంబోధించే బండ్ల గణేష్
నా దేవరతో నేను, భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ ని దేవర అని పిలుస్తాను అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. అందులో ఒక ఫోటో పెట్టగా ఫోటోలో బండ్ల గణేష్ అయ్యప్ప మాల ధరించి ఉన్నారు.

Bandla Ganesh changes Power star pawan kalyans name to devara

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరో రెండు సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టారు. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు ఒకటి కాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమా తెలుగు రీమేక్ షూటింగ్, ఈ రెండు సినిమాలు కొంత మేర పూర్తి చేశారు. త్వరలో ఆయన షూట్ మొదలు పెట్టనున్నారు. ఇక పవన్ - బండ్ల గణేష్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X