బండ్ల గణేష్ కి పర్సనల్ సెక్రెటరీ కావలెను.. రిక్వైర్మెంట్స్ ఏంటో మీరూ చూడండి!

నటుడిగా అనేక సినిమాల్లో నటించి తరువాత కాలంలో ప్రొడ్యూసర్ గా మారి సూపర్ హిట్ సినిమాలు అందించిన బండ్ల గణేష్ ఇప్పుడు సినిమాల విషయంలో కొంచెం సైలెంట్ అయ్యారనే చెప్పాలి. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆయన మళ్లీ యాక్టర్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ ఇచ్చిన అప్పుడు అది తనకు మంచి కం బ్యాక్ అవుతుందని భావించినా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది అని కూడా ఆయన నాలిక కరుచుకున్న పరిస్థితి.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఆసక్తికర పోస్టులు పెడుతూ ఉండే ఆయన తాజాగా పెట్టిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. ''హాయ్ ఫ్రెండ్స్ నాకు మంచి చదువుకున్న ఒక అబ్బాయి, వ్యక్తిగత కార్యదర్శిగా కావాలి, అతను మంచి ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగు మాట్లాడాలి, ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే దయచేసి బయో డేటాతో ట్విట్టర్ ద్వారా నన్ను సంప్రదించండి'' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ కి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.

Bandla Ganesh needs a secretary here are the requirements

మేము రెడీ అంటే మేము రెడీ అంటూ పెద్ద ఎత్తున రిక్వెస్ట్ వస్తున్నాయి. ఇక ఈ మధ్య బండ్ల ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు అంటూ కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది.. తమిళంలో యోగి బాబు హీరోగా వచ్చిన మండేలా సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారని ఆ రీమేక్ లో నటించమని బండ్ల గణేష్ కు ఆఫర్ వచ్చిందని కూడా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం సంగతి ఎలా ఉన్నా తాజాగా వెంకట్ అనే ఒక కొత్త దర్శకుడు బండ్ల గణేష్ కోసం ఒక కథ రాసుకుని ఈ మధ్య బండ్ల గణేష్ ని కలిసి కథ వినిపించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఆయన ది మెయిన్ రోల్ గా ఉండబోతుందని ప్రచారం జరగగా దానికి ఆయన హింట్ కూడా ఇచ్చారు. మరి చూడాలి ఏమవుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X