“అధికారంలో నేరాన్ని దాచగలవు కానీ..” బండ్ల గణేష్ టార్గెట్ ఎవరు..!?

బండ్ల గణేశ్‌.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి, తర్వాత నిర్మాతగా ఎదిగి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగారు బండ్ల గణేశ్. ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. సినిమాలతో పాటు తన నేరుగా మాట్లాడే స్టైల్, ఎప్పటికప్పుడు చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ మీడియా దృష్టిలో ఉంటారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా తన పోస్ట్‌లు, ట్వీట్లు తరచూ వైరల్ మారుతారు. అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సినీ, రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటీ? ఆయన ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడారు. అనేది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ తాజాగా చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. "అధికారంలో నేరాన్ని దాచగలవు, కానీ జీవితంలో దాచలేవు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది" అంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారింది. ఆయన చేసిన ట్వీట్ నెటిజన్లలో విభిన్న స్పందనలకు కారణమైంది. ఈ వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ఆయన వెల్లడించకపోయినా, చాలా మంది మాత్రం జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కే టార్గెట్ చేశారని అభిప్రాయపడుతున్నారు.

Bandla Ganesh s Cryptic Tweets Spark Speculation Targeting Pawan Kalyan

ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను "ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వరా" అంటూ దేవుడిలాగా కీర్తించిన బండ్ల గణేష్‌, ఇటీవలి కాలంలో మాత్రం ఆయనపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తోన్నట్టుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా 'ఓజీ'సినిమా రిలీజ్ సమయంలో ఆయన చేసిన ట్వీట్లు దీనికి మరింత బలం చేకూర్చాయి. సెప్టెంబర్ 24న బండ్ల చేసిన మరో ట్వీట్ వైరల్ గా మారింది. "కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు. నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారు. కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు" అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

పవన్‌నే ఉద్దేశించినదే అని నెటిజన్లు భావించారు. హైదరాబాద్‌లో జరిగిన 'ఓజీ'ఈవెంట్‌కి బండ్ల గణేష్‌కి ఆహ్వానం రాకపోవడమే ఆయనకు అసంతృప్తి కలిగించి, ఈ ట్వీట్లకు కారణమై ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సినిమా రిలీజ్ తర్వాత టాలీవుడ్‌కి చెందిన అనేక మంది సెలబ్రిటీలు పాజిటివ్ రివ్యూలు ఇచ్చినప్పటికీ, బండ్ల మాత్రం సైలెంట్ ఉండటం గమనార్హం. ఈ ట్వీట్లపై సోషల్ మీడియాలో విభిన్న కామెంట్స్ వెలుబడుతున్నాయి. అంతే కాకుండా.. ఇటీవల జరిగిన 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్‌లో సినిమా మాఫియా అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సందర్భంలో అల్లు అరవింద్‌ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి..ఆయనను మళ్లీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి, బండ్ల గణేష్‌ మాటలు, ట్వీట్లు స్పష్టత లేనిప్పటికీ, ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్‌గానే ఉందన్న భావన బలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పవన్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానం లో ఉన్న సందర్భంలో ఈ ట్వీట్లు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసలేం జరిగిందో ఆయనకే తెలియాలని అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X