పవన్ కల్యాణ్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే.. బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ( Bandla Ganesh) గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలతో తన సినీ కెరీర్ మొదలుపెట్టిన బండ్ల ఆ తర్వాత నిర్మాతగా ఎదిగారు. స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. "గబ్బర్ సింగ్", "బాడీగార్డ్", "ఐ లవ్ యూ" వంటి హిట్ సినిమాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. నిర్మాతగా మాత్రమే కాకుండా, తన మాట తీరు, సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు. ఎవరికీ భయపడని ధోరణితో బండ్ల గణేష్ ఎప్పుడూ మీడియా కంటబడుతారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమైందంటే?
బండ్ల గణేష్ సినిమాలు, రాజకీయాలు, వ్యక్తిగత విషయాలు ఏదైనా సరే ఆయన మాట్లాడితే అది హాట్ టాపిక్ అవడం ఖాయం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, పవన్ కళ్యాణ్ అభిమానిగా బహిరంగంగా ప్రకటించి, ఆయనను 'నా దేవుడు'అని ప్రకటించిన సందర్బాలు ఎన్నో. అయితే.. ఈ మధ్య కాలంలో వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని టాక్. బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు తలెత్తాయని, దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణమని అప్పట్లో టాక్ వినిపించింది. కానీ బండ్ల మాత్రం పవన్ పట్ల ఉన్న భక్తిని మాత్రం ఎప్పటకప్పడు ప్రకటిస్తునే ఉన్నారు. అయితే.. ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ సోషల్ మీడియాలో షాకింగ్ ట్విస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ క్రమంలో బండ్ల గణేష్ "కృతజ్ఞత లేని వ్యక్తి", " అధికారంలో నేరం దాచవచ్చు కానీ జీవితం ముందు కాదు" అనే ట్వీట్లు కూడా దృష్టిలో ఉంచుకుని, ఆయన నిజంగా ఎవరిపై గురిపెట్టారో అనే చర్చ ఊపందుకుంది. ఆయన మాటల వెనుక అర్థం ఏమిటో అని ఫ్యాన్స్ తెగ వెతుకుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. "అతను తన గురించి, నేపథ్యం, విద్య, విజయాలు, వైఫల్యాల గురించి అబద్ధాలు చెబుతాడు. పట్టుబడితే, అబద్ధం గురించి కూడా అబద్ధం చెబుతాడు. తర్వాత కొత్త అబద్ధాలకు వెళ్తాడు." అంటూ ట్విట్ చేశారు.
ఈ ట్వీట్ ఎవరి గురించి అని నెటిజన్లు ఊహిస్తున్నారు. కొందరు పవన్ కళ్యాణ్ అని అంచనా వేస్తున్నారు, మరికొందరు మాత్రం స్పష్టత లేనిదని వ్యాఖ్యానిస్తున్నారు. ట్వీట్ వైరల్ అవ్వడంతో బండ్ల మళ్లీ మీడియా దృష్టిలో నిలిచాడు. అయితే.. మరికాసేపటికే "నా పేరు బండ్ల గణేష్... నా దేవుడు.. నాకంటే మీకే బాగా తెలుసు. ఒకటే మాట, ఒకటే జీవితం" అని మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా కాసేపట్లోనే వైరల్ అయ్యింది. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్‌కు ఉన్న భక్తి అందరికీ తెలిసిందే. అందుకే చాలామంది నెటిజన్లు ఆయన ఈ ట్వీట్‌ను పవన్‌కే ఉద్దేశించి చేశారని భావిస్తున్నారు. కొందరు "మళ్లీ పవన్ కళ్యాణ్ గురించేనా?", "మాటలు మారుతున్నాయి బండ్ల అన్నా" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంతే కాకుండా.. ఇటీవల జరిగిన 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్‌లో సినిమా మాఫియా అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అరవింద్ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి..ఆయనను మళ్లీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి, బండ్ల గణేష్ మాటలు, ట్వీట్లు స్పష్టత లేనిప్పటికీ, ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్‌గానే ఉందన్న భావన బలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పవన్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానం లో ఉన్న సందర్భంలో ఈ ట్వీట్లు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసలేం జరిగిందో ఆయనకే తెలియాలని అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











