twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి గారు జనసేనలోకి అంటూ స్పెషల్ పోస్ట్.. ఊహించని రియాక్షన్ ఇచ్చిన బండ్ల గణేష్!

    |

    నటుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత విభిన్నమైన పాత్రలతో తన కంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ముఖ్యంగా కమెడియన్ గా అతను చేసిన పాత్రలు కొన్ని సినిమాల్లో బాగానే క్లిక్కయ్యాయి. మరి కొన్నాళ్ళకు బండ్లగణేష్ నిర్మాతగా మారి మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే.

    ఇక ప్రస్తుతం ప్రొడక్షన్ పనులకు కాస్త దూరంగానే ఉంటున్న బండ్లగణేష్ తనకు నచ్చిన సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశంపై స్పందిస్తూ ఉండే బండ్ల గణేష్ ఇటీవల జనసేనలో చేరతాను అని స్పందించిన విధానానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వివరాల్లోకి వెళితే..

    పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా..

    పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా..

    పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయినటువంటి బండ్లగణేష్ నటుడిగా మారిన తర్వాత నిర్మాతగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ అనే సినిమాను నిర్మించి డిజాస్టర్ ఎదుర్కొన్నప్పటికీ ఆ తరువాత గబ్బర్ సింగ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడిగా మారిపోయాడు.

    అతని స్పీచ్ కోసం

    అతని స్పీచ్ కోసం

    పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లో బండ్లగణేష్ మాట్లాడే మాటలు ఏవిధంగా వైరల్ అవుతాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కువగా చాలామంది మెగా అభిమానుల అతని స్పీచ్ కోసమే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ ను ఎంతగానో ఆరాధించే బండ్లగణేష్ అతని భక్తితో దేవర అనిపిలుచుకుంటాడు. సోషల్ మీడియాలో ప్రతిరోజు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఏదో ఒక మంచి విషయాన్ని గురించి చెబుతూనే ఉంటాడు.

    చిరంజీవి గారు జనసేన లోకి రావాలి

    చిరంజీవి గారు జనసేన లోకి రావాలి

    ఇక ఇటీవల బండ్ల గణేష్ జనసేనకు సంబంధించిన అనేక రకాల విషయాలపై కూడా స్పందిస్తాడు. జనసైనికుల చేస్తున్న కామెంట్స్ పై కూడా బండ్ల గణేష్ ఆ పార్టీలో ఒక సభ్యుడిగా పాల్గొంటాను అంటూ మద్దతు ఇస్తున్నాడు. అయితే ఒక అభిమాని చిరంజీవి గురించి స్పందించడంతో బండ్ల గణేష్ ఆ ట్వీట్ పై ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేశాడు.

    'చిరంజీవి గారు జనసేన లోకి రావాలి పార్టీని అధికారం లోకి తేవాలి. మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించాలి. అంధకారంలో ఉన్న ఏపీ ప్రజలను ఆదుకోవాలి. రాముడు లోని సౌమ్యం మీరు.. లక్ష్మనుడి లోని తెగింపు తమ్ముడిది. ఇద్దరు కలిస్తే శ్రీరామ రాజ్యం అవుతుంది.. అని తెలియజేశాడు.

    మరి నేను.. అంటూ..

    మరి నేను.. అంటూ..

    ఇక అభిమాని చేసిన కామెంట్ కు బండ్ల గణేష్ కూడా స్పందించాడు. ఒక్క మాటల్లోనే 'మరి నేను' అంటూ సమాధానమిచ్చాడు. అంటే బండ్ల గణేష్ జనసేన పార్టీలోకి చేరడానికి సిద్ధంగానే ఉన్నట్లుగా చెప్పకనే చెబుతున్నాడు. దీంతో అభిమానులు కూడా ఆయన రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది.

    అయితే గత ఎలక్షన్స్ లో బండ్లగణేష్ తెలంగాణలో కాంగ్రెస్ తరపున ప్రచారాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ ఆ పార్టీ ఓడిపోవడంతో ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాలేను అని చెప్పాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషిస్తాడు చూడాలి

    English summary
    Bandla ganesh sweet answer to janasena fans on social media..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X