For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prakash Rajకి బండ్ల షాక్.. మోసం చేసింది చాలు, బరిలో దిగుతున్నా.. మనస్సాక్షి మాట వినడం లేదంటూ!

  |

  తెలుగునాట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కలకలం రేపుతున్నాయి. రోజుకో ట్విస్ట్ తో సాధారణ ఎన్నికలను తలపిస్తూ రాజకీయ నాయకులకు ఎక్కడా తగ్గని విధంగా పోటీదారులు రోజుకో రకం ట్విస్ట్ ఇస్తున్నారు. నిన్నటిదాకా ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలుపుతూ వచ్చిన బండ్ల గణేష్ ఇప్పుడు ప్రకాష్ రాజు కి షాక్ ఇచ్చారు. షాక్ ఇవ్వడమే కాక తాను బరిలోకి దిగుతున్నా అంటూ ప్రకటించి కలకలం రేపారు. ఆ వివరాల్లోకి వెళితే

  సంచలనం

  సంచలనం

  నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ సారి చాలా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ముందు నుంచి కూడా ఎన్నికల ప్రకటన రాక ముందే ఎన్నికల మీద అంచనాలు పెంచేశారు. ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించడమే కాక సొంత ప్యానల్ కూడా ప్రకటించాడు. ప్రకాష్ రాజ్ బరిలోకి దిగుతున్నారు అని ప్రకటించిన తర్వాత మంచు విష్ణు కూడా తాను అధ్యక్ష బరిలో దిగుతున్నాను అని ప్రకటించాడు, ప్రకాష్ రాజ్ ప్రకటన తర్వాత నటి హేమ, నటి - దర్శకురాలు జీవిత రాజశేఖర్ కూడా మా అధ్యక్ష బరిలో దిగుతామని ప్రకటించారు.

  బండ్ల పోటీలో

  బండ్ల పోటీలో

  అనూహ్యంగా నటుడు సి వి ఎల్ నరసింహారావు కూడా తెలంగాణ వాదంతో బరిలోకి దిగుతానని ప్రకటించడమే, కాక రాముల వారి అండతో తానే అధ్యక్షుడిగా ఎన్నిక అవుతుంన్నానని కూడా ప్రకటించారు. కాదంబరి కిరణ్ కూడా తాను ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తానే పోటీలోకి దిగుతానని ప్రకటించాడు. అయితే ముందు నుంచి కూడా బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ వచ్చారు. ఆమధ్య కొన్ని ఇంటర్వ్యూలలో కూడా ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వం తనకు నచ్చింది కాబట్టి ఆయనకే సపోర్ట్ చేస్తున్నాను అని చాలా అవకాశాలు ఇచ్చే ఈ సారి ఆయనకు అవకాశం ఇస్తే తప్పేమిటి అన్నట్లుగా మాట్లాడారు, ఆయన ప్యానల్ నుంచి తాను కూడా పోటీ చేస్తానని ప్రకటించారు బండ్ల గణేష్.

  సారీ ప్రకాష్ రాజ్

  సారీ ప్రకాష్ రాజ్


  అయితే అనూహ్యంగా తాజాగా ప్రకాష్ రాజ్ రెండవసారి ప్రకటించిన ప్యానెల్లో హేమ జీవిత రాజశేఖర్ ఇద్దరూ కొత్తగా చేరారు. దీంతో బండ్ల గణేష్ ఆశించిన జనరల్ సెక్రటరీ పదవికి పోటీ గా జీవిత రాజశేఖర్ దిగుతున్నారు, మరి ఈ విషయంలో బండ్ల గణేష్ కు ప్రకాష్ రాజ్ కు మధ్య గ్యాప్ వచ్చిందో ఏమో తెలియదు కానీ ఈరోజు ఉదయం వరుసగా ట్వీట్లు పెట్టు వచ్చారు బండ్ల గణేష్. గౌరవనీయ ప్రకాష్ రాజ్ గారు, నన్ను అఫీషియల్ స్పోక్స్ మెన్ గా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు, కానీ నా వ్యక్తిగత పనుల కారణంగా ఈ పోస్ట్ కోసం నేను సంతృప్తికరంగా మరియు చట్టబద్ధంగా వ్యవహరించ లేక పోతున్నాను, దయచేసి ఈ పోస్ట్ కోసం మరొక వ్యక్తిని ఎంచుకోండి. మీ బృందానికి శుభాకాంక్షలు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

  మనస్సాక్షికి ఎంత చెప్పినా మాట వినడం లేదు

  మనస్సాక్షికి ఎంత చెప్పినా మాట వినడం లేదు

  అలాగే ''మాట తప్పను ... మడమ తిప్పను నాది ఒకటే మాట -ఒకటే బాట, నమ్మడం -నమ్మినవారికోసం బతకడం నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను - నేను ఎవరి మాట వినను త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తాను - పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను'' అని బండ్ల గణేష్ ప్రకటించారు. ''మనస్సాక్షికి ఎంత చెప్పినా మాట వినడం లేదు-నన్ను పోటీ చెయ్ అంటోంది -అందుకే ఈ పోటీ అందరికీ అవకాశం ఇచ్చారు ఒకే ఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా'' అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు.

   మోసం చేసింది చాలు

  మోసం చేసింది చాలు

  ''నా పరిపాలన ఏంటో తెలియచేస్తా, వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం దాని కోసం పోరాడతా... వారి సొంత ఇంటి కల నిజం చేస్తా ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు... ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు...'' అని కూడా ఆయన పేర్కొన్నారు. గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు అందరి ఆశీస్సులు కావాలి -మా ను బలోపేతం చేద్దాం ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ల కల నిజం చేద్దాం అదే మా నిజమైన అభివృద్ధి... చిహ్నం - ఇట్లు మీ బండ్ల గణేష్ అంటూ ఆయన వరుస ట్వీట్లు చేశారు.

  I'm Huge Fan Of Prabhas Says Sarkaru Vaari Paata Asst Director ​| Filmibeat Telug
  ముఖానికి గాయాలతో

  ముఖానికి గాయాలతో

  ఇక సినిమాల విషయానికి వస్తే బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రిషి ఆగస్త్య సమర్పకుడిగా, స్వాతి చంద్ర నిర్మాతగా యష్ రిషి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం అనంతరం పోలీస్ స్టేషన్ సెట్‌లో బండ్ల గణేష్‌పై సన్నివేశాలను తాజాగా చిత్రీకరించగా బండ్ల గణేష్‌కు సంబంధించిన లుక్‌ను కూడా ఆయన స్వయంగా షేర్ చేశారు. తెలుగులో నేను ముఖ్య పాత్ర పోషిస్తుండగా, హిందీ వెర్షన్లో అభిషేక్ బచ్చన్ నటిస్తున్నారు. వెంకట్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ మీ బండ్ల గణేష్ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  English summary
  Actor, Producer Bandla Ganesh to contest as General secretary in MAA Elections, he made some sensational tweets regarding this.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X