twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దండం పెడుతా.. చనిపోయిన వ్యక్తి గురించి రాజకీయాల్లొద్దు.. బండ్ల గణేష్

    |

    Recommended Video

    Bandla Ganesh Tweet On Kodela Siva Prasad Demise || కోడెల మృతి పై బండ్ల గణేష్ ఎమోషనల్

    తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణవార్త విని సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించి.. రాజకీయాల్లో పలు పదవులను అలంకరించి తనదైన ముద్రను వేసుకొన్నారు. అయితే అనూహ్య పరిస్థితుల్లో కొడెల ఆత్మహత్యకు పాల్పడటం సినీ వర్గాలను షాక్ గురిచేసింది. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, రాజకీయ నేత బండ్ల గణేష్ స్పందించారు.

    ట్విట్టర్‌లో బండ్ల గణేష్

    ట్విట్టర్‌లో బండ్ల గణేష్

    మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మృతి వివాదం కావడం, పలువురు తమకు తోచిన విధంగా స్పందిస్తున్న నేపథ్యంలో బండ్ల గణేష్ కలత చెందినట్టు కనిపించింది. మరణించిన వ్యక్తి గురించి వివాదాస్పదంగా మాట్లాడకూడదనే విధంగా మాట్లాడారు. ఈ మేరకు సోషల్ మీడియాలోని తన ట్విట్టర్ అకౌంట్‌లో స్పందించారు.

    రాజకీయాలు చేయొద్దు

    రాజకీయాలు చేయొద్దు

    శివప్రసాద్ మృతిపై స్పందిస్తూ.. దయచేసి ప్రతీ రాజకీయ నాయకుడికి చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. చనిపోయిన వ్యక్తి గురించి.. చనిపోయిన మనిషి గురించి రాజకీయాలు చేయొద్దు అంటూ ట్వీట్ చేశారు. శివప్రసాద్ మృతిపై తీవ్ర దిగ్రాంతిని కూడా వ్యక్తం చేశారు.

    ఆత్మకు శాంతి చేకూరాలని

    ఆత్మకు శాంతి చేకూరాలని

    కోడెల మృతికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. నాకు అత్యంత అత్మీయులైన నాకు నా కుటుంబానికి తీరని నష్టం. వారి ఆత్మకు శాంతి చేకూరాలిని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.

    రాజకీయాలకు దూరంగా బండ్ల గణేష్

    రాజకీయాలకు దూరంగా బండ్ల గణేష్

    ఇక సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

    English summary
    Producer Bandla Ganesh tweet on Kodela Siva Prasad death. He requested not to politicise the death of Kodela. He condolanced the death and prayed rest in peace.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X