For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘స్టూవర్ట్‌పురం దొంగ’గా మారిన నిర్మాత కొడుకు: మళ్లీ ఆ కాలానికి తీసుకెళ్లేందుకు ప్లాన్

  |

  టాలీవుడ్‌లోకి చాలా మంది సినీ ప్రముఖుల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఎంతో మంది తమ సత్తాను నిరూపించుకుని స్టార్ హీరోలుగా ఎదిగిపోయారు. కానీ, కొందరు మాత్రం ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం వేచి చూస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ ఒకడు. 'అల్లుడు శ్రీను'తో హీరోగా ఎంటరైన అతడు.. హిట్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. అయినప్పటికీ అతడు వరుస పెట్టి మూవీలను చేస్తూనే ఉన్నాడు.

  SR Kalyanamandapam 5Days Collections: చిన్న మూవీకి రికార్డు కలెక్షన్లు.. అప్పుడే అన్ని కోట్ల లాభాలు

  బెల్లంకొండ వారి అబ్బాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చాలా కాలానికి అంటే రెండేళ్ల క్రితమే 'రాక్షసుడు'తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. సైకో క్రైమ్ థ్రిల్లర్‌ మూవీగా వచ్చిన ఇది సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్లనూ భారీ స్థాయిలో రాబట్టింది. అలాగే, నటుడిగానూ ఈ యంగ్ హీరోకు మంచి పేరు తెచ్చింది. ఈ విజయాన్ని ఆస్వాదించే లోపే 'అల్లుడు అదుర్స్' రూపంలో అతడిని మరో పరాజయం పలకరించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. దీంతో శ్రీనివాస్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

  పంథాను మార్చుకుని ఎన్ని చిత్రాలు చేసినప్పటికీ శ్రీనివాస్‌కు సూపర్ హిట్లు దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ యంగ్ హీరో 'ఛత్రపతి' హిందీ రీమేక్‌ను ప్రారంభించాడు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని వీవీ వినాయక్ బాలీవుడ్‌లోకి తీసుకుని వెళ్తున్నాడు. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఈ చిత్రం అధికారికంగా ప్రారంభం అయింది. ఇదలా ఉండగా.. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు మరో ప్రాజెక్టును ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన దక్కుతోంది.

  Anchor Pradeepపై సునీత సంచలన వ్యాఖ్యలు: ఆడవాళ్లపై అలా.. అందుకే పెళ్లి కావట్లేదంటూ!

  Bellamkonda Sreenivas Stuartpuram Donga Movie Announced

  బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం 'స్టూవర్ట్‌పురం దొంగ' అనే సినిమాలో నటిస్తున్నాడు. 1970 కాలంలో గజగజలాడించిన టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీన్ని కేఎస్ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందని ప్రకటించింది. ఇక, ఈ పోస్టర్ ప్రాజెక్టుపై అంచనాలను పెంచే విధంగా ఆకట్టుకుంటోంది.

  వాస్తవానికి 'స్టూవర్ట్‌పురం దొంగ' ప్రాజెక్టు రెండేళ్ల క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది. అప్పుడే సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్‌తో పాటు డైలాగ్ వెర్షన్‌ను కూడా కంప్లీట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇది ఎందుకనో పట్టాలెక్కలేదు. అంతేకాదు, ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రకు రేణు దేశాయ్‌ను తీసుకుంటున్నారనే టాక్ వినిపించింది. ఆ తర్వాత ఈ వార్తలను ఆమె ఖండించింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇది ప్రారంభం కాబోతుంది. దీంతో ఈ సినిమాపై బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

  English summary
  Tollywood Young Hero Bellamkonda Sreenivas Searching For A Hit. Recently He Started Hindi Chatrapathi Movie. Now This Hero Announced His Stuartpuram Donga Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X