For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇండియా వైడ్ ఇమేజ్ రావడం వల్లే ఇలా... క్షమించమని వేడుకున్నా వదలను.. నరకం చూపిస్తా.. : బెల్లంకొండ

  |

  టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఆయన తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇద్దరి మీద ఛీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొట్టడమే కాక అడిగితే బెదిరిస్తున్నారు అంటూ ఒక నిర్మాత కం ఫైనాన్షియర్ కోర్టుకు ఎక్కడంతో కోర్టు ఆదేశాలతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం మీద ఇప్పుడు బెల్లంకొండ సురేష్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

  శరణ్ కుమార్‌ ఫిర్యాదు

  శరణ్ కుమార్‌ ఫిర్యాదు

  నిర్మాత బెల్లంకొండ సురేష్‌, ఆయన కుమారుడు, నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లపై వీఎల్‌ శరణ్ కుమార్‌ అనే ఫైనాన్షియర్‌ కోర్టుకెకెక్కారు. కోర్టు ఆదేశాలతో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసారు. 2018 - 2019 మధ్య కాలంలో సినిమా నిర్మాణం కోసం బెల్లంకొండ సురేష్, సాయి శ్రీనివాస్ రూ. 85 లక్షలు తీసుకున్నారని, అప్పటి నుంచి తిరిగి ఇవ్వడానికి నిరాకరించారని శ్రవణ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన డబ్బు తనకు తిరిగి చెల్లించమని అడిగినప్పుడు సురేష్ అలాగే శ్రీనివాస్ తనను బెదిరించారని కూడా శరణ్ ఆరోపించాడు.

  అప్పుగా తీసుకున్నారని

  అప్పుగా తీసుకున్నారని

  ఆ ఇద్దరూ తనను మోసం చేశారని, ఒక సినిమాలో నిర్మాణ భాగస్వామిని చేస్తానని హామీ ఇవ్వడంతో తాను కొంతమంది సాంకేతిక నిపుణులకు ఆ మొత్తాన్ని బదిలీ చేసినట్లు కూడా శరణ్ కుమార్ ఆరోపించారు. బెల్లంకొండ శ్రీనివాస్ గోపీచంద్ మలినేని మరియు కోన వెంకట్‌లతో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసాడు, కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో అందరికీ అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చారు, కానీ శరణ్ కుమార్‌కి ఇవ్వలేదని టాక్ వినిపించింది.

  హౌరా బ్రిడ్జ్ చిత్రాన్ని నిర్మించిన శరణ్ కుమార్ బెల్లంకొండ సురేష్ , బెల్లంకొండ శ్రీనివాస్‌ లు సినిమా నిర్మాణం కోసం డబ్బులు అవసరమని 2018 లో మొదట 50 లక్షలు అప్పుగా తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

   కోర్టులో కేసు వేయడం ఏంటి

  కోర్టులో కేసు వేయడం ఏంటి

  అయితే తన మీద నమోదైన కేసు మీద బెల్లంకొండ సురేష్ స్పందించారు. 85 లక్షల రూపాయలు ఇచ్చాను అంటూ నాపై ఆరోపణలు వచ్చాయని, కేవలం నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఆరోపణలు చేశారని సురేష్ ఆరోపించారు. శరణ్ కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడని, అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారని సురేష్ పేర్కొన్నారు. శరణ్ తన పిల్లలు జోలికి వచ్చాడని పేర్కొన్న ఆయన పిల్లలు తన పంచ ప్రాణాలు అని, శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటానని అన్నారు. అతని పై పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్న ఆయన ఏదన్నా ఆధారాలు ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి కానీ ఇలా కోర్టులో కేసు వేయడం ఏంటి అని ప్రశ్నించారు. 2018 లో తీసుకున్నానని ఆరోపించాడు..

  నరకం చూపిస్తా

  నరకం చూపిస్తా

  ఇన్ని రోజులు కనీసం నన్ను కలువలేదని ఆయన అన్నారు. లీగల్ గా శరణ్ కు నరకం చూపిస్తానని బెల్లంకొండ అన్నారు. ఇప్పటి వరకు తన పిల్లలు ఎక్కడ ఎవరి జోలికి వెళ్ళరు, దేశ వ్యాప్తంగా తన కుమారుడు శ్రీనివాస్ కు మంచి ఇమేజ్ ఉందని, శ్రీనివాస్ ఇమేజ్ దెబ్బ తీసేందుకు ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. నాకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదని, నా పై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారని ఆయన అన్నారు.

  బయట పెడతా

  బయట పెడతా

  నా పై చేసిన ఆరోపణల పై ఆధారాలు ఉంటే ఇవ్వాలని శరణ్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. శరణ్ ది మా ఊరే... పదేళ్ళ క్రితం పరిచయం.. టికెట్ల కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడని, శరణ్ అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు.. అతని క్షమించమని వేడుకున్నా నేను ఊరుకోనని అన్నారు. బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నాడని సురేష్ ఆరోపించారు.

  శరణ్ వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు.. అతనెవరో బయట పెడతానని అన్నారు. నోటీసులు రాకున్నా నేను ఇప్పుడు రమ్మన్నా విచారణకు వస్తానని, ఒక వేళ డబ్బులు తీసుకుంటే నాలుగేళ్ళ నుండి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అని ఆయన ప్రశ్నించారు. అసలు నా కాల్ లిస్ట్ తీసుకున్నా అసలు అతను ఫోన్ చేశాడా లేదా అని తెలుస్తుందని అన్నారు.

  English summary
  Bellamkonda Suresh Responds on sharan kumar's cheating case against him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X