భార్య పిల్లలతో సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. రవితేజ వల్లే.. భీమ్స్ షాకింగ్

Bheems Ceciroleo: 'మాస్ జాతర' సినిమా ఈవెంట్‌లో తాను బతికి ఉండటానికి కారణం మాస్ రాజా రవితేజానే అంటూ ఎమోషనల్ అయ్యారు. 'నిన్ను వదిలీ ఉండలేనూ.. నిన్ను విడిచీ వెళ్లలేనూ.. ఎట్ల నేను సేద్దునో.. ఎట్లా నేను బడి సద్దునో.. నువ్వైనా చెప్పమ్మా పాటమ్మ.. నన్నైనా చెప్పుకొనివమ్మ పాటమ్మ' అంటూ భావోద్వేగభరితమైన పాటతో తన స్పీచ్ ప్రారంభించాడు. 'ఒక రోజు ఈ పాట పాడుకుంటూ.. నేను సెల్పీ వీడియో తీసుకున్నా.. నాతో పాటు నా భార్య, పిల్లలను కూడా వీడియో తీసా.. అయితే నేను ఎందుకు వీడియో తీస్తున్నానో వాళ్లకు తెలియదు. అప్పటికి ఇంటికి కిరాయిలా కట్టాలి? పిల్లల్ని ఎలా చదువుకోవాలి. ఎలా బతకాలి ? రేపు ఇల్లు ఎలా గడపాలి? అనే సందేహంలో ఉన్నాను' అంటూ ఎమోషనల్ అయ్యారు.

'అలాంటి చిట్టచివరి క్షణంలో ఉన్నప్పడు.. మా ఇంట్లో సెల్ ఫోన్ కు సిగ్నల్స్ రానీ, ఒక ఇంట్లో నేను ఉంటున్నప్పుడు... ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు పీపుల్స్ మీడియా ఆఫీస్ ఆఫీస్ కి రావాలి అని. అలాంటి పెద్ద కంపెనీ నుండి నన్ను పిలవడం ఏంటి? అని మొదట ఆశ్చర్యపోయానని తెలిపారు. కన్పామ్ చేసుకోవడానికి మీరు ఫోన్ చేసింది ఎవరికీ అని తిరిగి ప్రశ్నించానని తెలిపారు. 'ఆ టైంలో నా పరిస్థితి ఏంటో తెలుసా.. ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి. నాకు జీవితం లేదు. నా భార్య పిల్లలకు కూడా జీవితం లేదు. అందరం కట్టకట్టుకుని చనిపోదామని నిర్ణయించుకుందాం.. అలాంటి సమయంలో ఓ దేవుడిలాగా.. ఒక జీసస్ లాగా.. ఒక అల్లా లాగా.. ఒక రాముడిలాగా.. తిరుపతి వెంకన్నలాగా.. మనందరం ముఖ్య దేవుడిలాగా.. ప్రత్యక్షంగా ఒక మనిషి నాకోసం నిలబడ్డాడు. ఆ నిలబడ్డ వ్యక్తి పేరు శక్తి పేరు వ్యవస్థ పేరు రవితేజ సర్..' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

Bheems Ceciroleo s Emotional Speech About Ravi Teja at Mass Jathara Pre-Release Event Goes Viral

భీమ్స్ సిసిరోలియో అంతటి ఆగకుండా.. 'మాటల్లో చెప్పాలంటే ప్రేమ.. పాటలల్లో చెప్పాలంటే భక్తి.. ఈరోజు నేను ఇక్కడ రెండు కాళ్లపై నిలబడి ఉన్నాను. ఐదువేలతో తింటున్నానంటే కారణం రవితేజ సార్.. అమ్మానాన్న .. నీ కొడుకును సజీవంగా నిలబడ్డారంటే.. రవి తేజ కారణం'అన్నారు. 'మాటల్లో చెబితే సమాధానం అవుతుంది. పాటలో చెబితే చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే నా ప్రేమ ఎప్పుడూ సంగీతం రూపంలో సార్ కి చెప్తాను' అని భీమ్స్ వెల్లడించారు.. 'చాలామంది అనుకోవచ్చు.. అవసరాల కోసం అవకాశాల కోసం.. చాలా కథలు చెబుతారు.. కహానీలు చెబుతారనుకోవచ్చు. కానీ, సిసిరోలియో ఎన్నడు కథలు చెప్పడు.. ఉన్నది మాత్రమే చెబుతాడు. ఉన్నది మాత్రమే మాట్లాడుతాడు. అందుకే సార్ కి నేను అంటే ఇష్టం.. నాకు సార్ అంటే ఇష్టం' అని వెల్లడించారు.

భీమ్స్ సిసిరోలియో తన స్పీచ్ ను కొనసాగిస్తూ.. 'చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు.. సార్ తో ఎందుకు పని చేస్తున్నావు? అని.. నాలాంటివారు నిలబడ్డారంటే.. రేపు రాబోయే నాలాంటి వారికి ఆయన ఓ ఆశ.. ఆయన ఎంతోమందికి అవకాశాలు ఇవ్వబోతున్నారు. ఆయన ఇక్కడ ఉండడమంటే.. నాలాంటి వారిని నిలబెట్టడం. ఆయన సినిమాలు రావడం అంటే నాలాంటి వాళ్ళ పాటలకి ప్రత్యక్ష రూపం రావడం. ప్రపంచంలో సమాజంలో పేరు రావడం. మన అందరి తల్లిదండ్రుల ముందు మనంతట మనం గర్వంగా నిలబడి.. ఇదిరా నీ కొడుకు అని గర్వంగా చెప్పుకునేలా చేయడం. అందుకే నాకు రవితేజ సార్ అంటే ఇష్టం. నేను ఆవేశంలోనూ. మరి ఏదో చెప్పడానికో.. వేరేలా ఏమార్చడానికో ఇలా మాట్లాడడం లేదు. మళ్లీ మరోసారి చెబుతున్న ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సంగీతం అందించాను. ఇలాంటి సినిమాకు సంగీతం ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు'అని పేర్కొన్నారు.

చివరిగా.. 'ఈ పాటకు రిధం లేదు.. కదం లేదు.. పదం లేదు. అర్థం లేదు.. పదం లేదు.. స్వార్థం కీర్థం అసలు లేదు.. సూపర్ డూపర్ హిట్టు.. సూపర్ డూపర్ హిట్ సాంగ్'అనే పాట పాడుతూ.. ఈ పాటలు చేసేటప్పుడు ఎంతో మంది విమర్శించారు. నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ పాటను రాశాను' అని స్పష్టం చేశారు భీమ్స్. చివరిగా దివంగత సంగీత దర్శకుడు చక్రి గారి పాటను పాడుతూ ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తానికి సిసిరోలియా ఎమోషనల్ స్పీచ్ ప్రస్తుతం నెటింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. రవితేజ కెరీర్‌లో 75వ సినిమా (RT75)గా మాస్ జాతర అనే సినిమా రూపొందించబడింది. ఈ సినిమాతో 'సామజవరగమన' ఫేమ్ రైటర్ భాను బొగవరపు డైరెక్టర్‌గా మారుతుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ అందరినీ కదిలించింది. 'బలగం', 'ధమాకా', 'రాజాకార్' వంటి బ్లాక్‌బస్టర్లకు మ్యూజిక్ అందించిన భీమ్స్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "మన శంకర్ వర ప్రసాద్ గారు" సినిమాలో కూడా సంగీతం సమకూర్చి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X