Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్: సర్‌ప్రైజింగ్ చీఫ్ గెస్ట్.. వేదిక ప్రాగణం హోరెత్తిపోవాల్సిందే!
యంగ్ హీరో నితిన్ తాజా సినిమా 'భీష్మ'. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఫినిష్ చేసుకొని ఫిబ్రవరి 21న విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన చిత్రయూనిట్.. ఓ సర్‌ప్రైజింగ్ గెస్ట్‌ని ఆహ్వానించారు. మరి ఆ సర్‌ప్రైజింగ్ గెస్ట్ ఎవరు? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? ఆ వివరాలేంటో చూద్దామా..

నితిన్- రష్మిక జోడీ.. ఆడియన్స్ వెయిటింగ్
'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా 'భీష్మ' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. నితిన్- రష్మిక జోడీ చూడాలని కుతూహలంగా ఉన్నారు ఆడియన్స్.

జోరుగా ప్రమోషన్స్.. భారీ రెస్పాన్స్
ఓ వైపు షూటింగ్ చేస్తూనే జోరుగా ప్రమోషన్స్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసింది భీష్మ యూనిట్. ఇందులో భాగంగా ఇటివలే ఈ సినిమా నుండి ‘వాట్ యే బ్యూటీ' సాంగ్, 'సింగిల్ అంతెమ్' వీడియో ప్రోమో విడుదల చేసి అంచనాలు పెంచేశారు. ఈ పాటలకు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదిక ఎక్కడంటే
ఇక ‘భీష్మ' రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది చిత్రబృందం. ఈ మేరకు ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్లాన్ చేశారు. యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఫిబ్రవరి 17 సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. దీనికి ముఖ్య అతిధిగా మెగా డైరెక్టర్ వస్తుండటం ఆసక్తికర అంశం.

చీఫ్ గెస్ట్.. ప్రాగణం హోరెత్తిపోవాల్సిందే
ఇటీవలే అల.. వైకుంఠపురములో సినిమాతో గ్రాండ్ సక్సెస్ సాధించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. భీష్మ యూనిట్ కోరిక మేరకు ఆయన ఈ వేడుకకు రాబోతున్నట్లు సమాచారం. దీంతో ఆయన మాటల తూటాలతో ప్రాగణం హోరెత్తిపోవడం ఖాయం అని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.

ఆయన రాక.. భీష్మ బజ్ రెట్టింపు
భీష్మ సినిమాలో వెన్నల కిశోర్ అండ్ నితిన్ కామెడీ ట్రాక్ హైలెట్ అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే కుమారి 21 ఎఫ్‌తో ఆకట్టుకున్న హెబ్బా పటేల్ కీలక పాత్రలో కనిపించనుండటం మరో ఆసక్తికర అంశం. చిత్రానికి మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మొత్తానికి త్రివిక్రమ్ రాక సినిమాకు మరింత బజ్ తేనుందని అర్థమవుతోంది.