భీష్మ థర్డ్ సింగిల్: ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే..

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నితిన్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'భీష్మ'. 'ఛలో' సినిమాతో సక్సెస్ సాధించి మంచి గుర్తింపు పొందిన దర్శకుడు వెంకీ కుడుముల ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం వహించాడు. నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.

ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు, టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.

Bhishma Third single Sara Sari Lyrical video release

ఈ నేపథ్యంలోనే తాజాగా 'భీష్మ' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ''సరాసరి'' పేరుతో రిలీజైన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది. శ్రీమణి అందించిన లిరిక్స్‌పై అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే.. అంటూ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది ఈ లిరికల్ సాంగ్.

ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతున్న భీష్మ సినిమాకు సంబంధించి ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు ఫినిష్ అయ్యాయి. ఇటీవలే తన డబ్బింగ్ పూర్తిచేసినట్లుగా పేర్కొంటూ రష్మిక ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమాలో వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ హైలెట్ అవుతుందని సమాచారం. యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న నితిన్ - రష్మిక జోడీ కట్టడం ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X