twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరిని నమ్మవద్దు అంటూ సూసైడ్ చేసుకున్న మరో నటి.. ఫేస్ బుక్ లైవ్‌లోనే..

    |

    ముంబై నగరంలో వరుసగా సినీ నటుల ఆత్మహత్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒక ఘటన గురించి మరువక ముందే వరుసగా బాలీవుడ్ లో సినీ తారల మరణాలు అంధరిని షాక్ కి గురి చేస్తున్నాయి. సుశాంత్ మరణించిన తరువాత ఒక టీవీ యాక్టర్ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో నటి కూడా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చనిపోయిన ముందు రోజు ఆమె ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ చేసి బాధతో కొన్ని విషయాలను బయటపెట్టడం కొత్త అనుమానాలకు దారితీస్తోంది.

     కేవలం బాలీవుడ్ లోనే కాకుండా

    కేవలం బాలీవుడ్ లోనే కాకుండా

    మరో వారం గడిస్తే సుశాంత్ సింగ్ మరణించి రెండు నెలలు పూర్తవుతుంది. ఈ గ్యాప్ లోనే దేశవ్యాప్తంగా ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని సూసైడ్ కేసులు నమోదయ్యాయి. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా అలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. ఇక రీసెంట్ గా భోజ్ పురికి చెందిన ఒక నటి కూడా ఇండస్ట్రీలో మోసం కారణంగా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది.

     40ఏళ్ళ మరో నటి సూసైడ్

    40ఏళ్ళ మరో నటి సూసైడ్

    వివరాల్లోకి వెళితే.. భోజ్ పూరిలో పలు సినిమాలతో అలాగే సీరియల్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి అనుపమ పాథక్. 40 ఏళ్ళ అనుపమ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటోంది. అయితే రీసెంట్ గా ముంబైలోని తన నివాసంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను షాక్ కి గురి చేసింది.

    తాను మోసపోయాను అంటూ

    తాను మోసపోయాను అంటూ

    ఇక ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో సూసైడ్ నోట్ కూడా దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక అనుపమ సూసైడ్ చేసుకోవడానికి ఒక రోజు ముందు ఫేస్ బుక్ లైవ్ లో పలు కీలక విషయాలను తెలిపింది. చివరకు తాను మోసపోయాను అంటూ ఎవరిని కూడా నమ్మవద్దని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
     ఎవరిని నమ్మవద్దు

    ఎవరిని నమ్మవద్దు

    'అందరితో నమ్మకంగా ఉండడి. కానీ ఎవరిని మీరు నమ్మవద్దు. నా జీవితంలో నేను నేర్చుకున్న విషయం ఇదే. ఒక విజ్ డమ్ ప్రొడ్యూసర్ కంపెనీ సంస్థలో 10వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. మళ్ళీ ఆ తరువాత నాకు ఆ డబ్బులు రాలేవు' అని ఫేస్ బుక్ లో లైవ్ లో తెలిపింది. ఇక మనీష్ ఝా అనే వ్యక్తి తన దగ్గర తీసుకున్న ద్విచక్ర వాహనాన్ని తిరిగి ఇవ్వలేదని అనుపమ సూసైడ్ నోట్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

    English summary
    Another week would have passed and two months would have passed since Sushant Singh died. Unexpectedly, some suicide cases related to the film industry were reported across the country within this gap. Not only in Bollywood but also in other industries such incidents are shocking to everyone. Recently, an actress from Bhojpuri also had to commit suicide due to fraud in the industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X