‘మహాసముద్రం’ నుంచి బిగ్ అప్‌డేట్: అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్ ట్వీట్

తెలుగులో మల్టీస్టారర్ మూవీలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. ఆ తరహా చిత్రాలకు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడంతో దర్శక నిర్మాతలు కూడా అందుకు తగ్గట్లుగా కథలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారీ చిత్రాలతో పాటు చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'RX 100' సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయిన దర్శకుడు అజయ్ భూపతి 'మహాసముద్రం' అనే మల్టీస్టారర్ మూవీని రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమై ట్వీట్ చేశాడతను.

'RX 100' వంటి హిట్ సినిమాను తెరకెక్కించినా.. రెండో ప్రాజెక్టు విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. సుదీర్ఘ విరామం తర్వాత అతడు తన డ్రీమ్ ప్రాజెక్టు 'మహాసముద్రం'ను పట్టాలెక్కించేశాడు. వాస్తవానికి ఈ సినిమాలో నటించేందుకు గానూ ఎంతో మంది హీరోలకు కథను చెప్పినా.. వాళ్లెవరూ దీనికి పచ్చజెండా ఊపలేదు. కొందరు ఒప్పుకున్నా.. హోల్డ్‌లో పెట్టి ఉంచారు. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్, సిద్దార్ధ్ కాంబినేషన్‌లో దీన్ని తీస్తున్నాడు. ఇక, ఈ చిత్రంలో అదితి రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 Big Update Coming from Mahasamudram

ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన 'మహాసముద్రం' గురించి దర్శకుడు అజయ్ భూపతి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసిన దర్శకుడు.. 'షూటింగ్ జరుగుతోంది. మా సున్నితమైన భావోద్వేగాలతో కూడిన ప్రేమకథను మీకు చూపించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాము. త్వరలోనే ఓ భారీ అప్‌డేట్‌తో రాబోతున్నాము. వేచి చూడండి' అంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X