Don't Miss!
- Sports
U19 Women’s T20 World Cup Final: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మరోసారి సహాయలు అందిస్తూ.. రియల్ హీరో అనిపించుకుంటున్న సోహైల్
టెలివిజన్ సీరియల్స్ లో మొదట మంచి గుర్తింపు అందుకున్న యువ నటుడు సయ్యద్ సోహైల్ అనంతరం బిగ్ బాస్ షో ద్వారా తన క్రేజ్ ను మరింత పెంచుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్స్ వరకు వచ్చిన సోహైల్ చివరలో తెలివిగా సగం ప్రైజ్ మనీతో బయటకు వచ్చి బాగానే ఎట్రాక్ట్ చేశాడు. ఒక విధంగా టాప్ 2 కంటెస్టెంట్స్ కంటే కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు.
దీంతో అతనికి వెనువెంటనే సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి.బిగ్ బాస్ షోతో లక్షలాది మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇక వెంటనే యూ ట్యూబ్ లో ఛానెల్ కూడా క్రియేట్ చేయడంతో అక్కడ కూడా ఫాలోవర్స్ గట్టిగానే పెరిగారు. అభిమానులు సోహైల్ చేసే ప్రతి వీడియోలను లైక్, కామెంట్స్ చేస్తూ ఉంటారు.. ప్రైజ్ మనితోనే కాకుండా సొంత డబ్బులతో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అభిమానుల మనసుకు మరింత దగ్గరవుతున్నాడు.

ఇటీవల సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థను స్థాపించి చాలామందికి సహాయం చేశాడు. ఇక సెకండ్ వేవ్ లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు తనవంతు సాయంగా నిత్యావసర వస్తువులను అందిస్తున్నాడు. తన అభిమానుల నుంచి కూడా మద్దతు అందుకుంటున్నట్లు చెబుతూ సోహిలియన్స్ గా ఫామ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నట్లు వివరణ ఇచ్చారు.
కేవలం నిత్యావసర వస్తువులు మాత్రమే కాకుండా 24 లక్షలకు పైగా ఖర్చుతో వైద్య సేవలు అందించామని వెల్లడించారు. బ్రెయిన్ ట్యూమర్, గుండెసంబంధిత వ్యాధులతోనే కాకుండా ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా సహాయం చేసినట్లు చెబుతూ.. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగుతూ ఉంటాయని సోహైల్ వివరణ ఇచ్చారు.