రియా చక్రవర్తికి బీహార్ ప్రభుత్వం షాక్.. సుప్రీంకోర్టులో సుశాంత్ కేసు కోసం..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దర్యాప్తు విషయంలో బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొన్నది. సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్ దాఖలు చేసిన సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్‌కు అండగా నిలువాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తాజాగా తనపై సుశాంత్ సింగ్ తండ్రి దాఖలు చేసిన కేసును పాట్నా నుంచి ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే రియా పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని సుశాంత్ కుటుంబం సుప్రీంను ఆశ్రయించింది.

రియా పిటిషన్‌కు బదులుగా సుశాంత్ కుటుంబం దాఖలు చేసిన కేవీయట్ పిటిషన్‌ను విచారించాలని సుప్రీంకోర్టును బీహార్ ప్రభుత్వం కోరింది. సుశాంత్ కేసును రెండు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేయడం సరికాదుంటూ రియా పిటిషన్ దాఖలు చేయడాన్ని వికాస్ సింగ్ తప్పుపట్టారు.
ఈ విషయంపై సుశాంత్ సింగ్ ఫ్యామిలీ లాయర్ మాట్లాడుతూ... ఒకవేళ సుప్రీంను రియా ఆశ్రయించాలంటే ముందుగా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరాల్సింది అని అన్నారు. అలా కాకుండా పాట్నాలో నమోదైన కేసును ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేయాలని సుప్రీంను ఆశ్రయించడంలో ఆమె ఆంతర్యం ఏమిటో అని ప్రశ్నించారు. దీనిబట్టి చూస్తూ రియాకు ముంబై పోలీసులు సహకరిస్తున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని అన్నారు.


Click it and Unblock the Notifications











