Don't Miss!
- Sports
అతన్ని ఆర్సీబీ అనవసరంగా రిటైన్ చేసుకుంది: పార్థీవ్ పటేల్
- News
బీజేపీ కోసం తెలంగాణలో పవన్‌కల్యాణ్ రాజకీయం??
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Google CEO Sundar Pichai పై బాలీవుడ్ దర్శకుడి కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మరో ఐదుగురిపై కేసు నమోదైంది. కాపీరైట్ హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణలపై బాలీవుడ్ సినీ ప్రముఖుడు ముంబైలో కేసు నమోదు చేశాడు. దాంతో పిచాయ్‌కి పోలీసులు నోటీసులు పంపే ఆలోచనలో ఉన్నారు. బాలీవుడ్ చిత్రాన్ని అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినందుకు బాధ్యుడిని చేస్తూ ఫిల్మ్ మేకర్ సునీల్ దర్శన్ కేసు నమోదు చేశారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. 2017లో విడుదలైన బాలీవుడ్ సినిమా ఏక్ హసీనా థి ఏక్ దీవానా థా చిత్రాన్ని మా అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ సినిమాకు లక్షలాది సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా విషయంలో యూట్యూబ్ కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించింది అని తన పిటిషన్‌లో సునీల్ దర్శన్ పేర్కొన్నారు.

ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా చిత్రానికి సంబంధించి లెక్కలేనన్ని హక్కుల ఉల్లంఘన జరిగాయి. చట్టవ్యతిరేకంగా మా సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అందుకు బాధ్యత సుందర్ పిచాయ్‌దే అని భావిస్తున్నాను. దాదాపు 1 కోటి వ్యూస్ ఈ సినిమాకు వచ్చాయి. నా ఫిర్యాదును కంపెనీ దృష్టికి తీసుకురావాలనే కారణంతో వారిపై చర్య తీసుకోవడం లేదుఅ ని తన పిటిషన్‌లో సునీల్ దర్శన్ తెలిపారు. ఈ వ్యవహారంలో గూగుల్ పిచాయ్, జో గ్రియర్, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
ఇక ఏక్ హసీనా ఏక్ దివానా థా చిత్రం విషయానికి వస్తే.. సునీల్ దర్శన్ దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ సినిమాలో శివ్ దర్శన్, నటాషా ఫెర్నాండేజ్, ఉపెన్ పటేల్ నటించారు.
అలాగే సుందర్ పిచాయ్ విషయానికి వస్తే.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును ఇచ్చింది. కొద్దికాలంగా గూగుల్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచయ్ భారతీయుడు అనే విషయం దేశానికి గర్వకారణంగా మారింది.