పూజా హెగ్డే అలాంటి పని చేసింది.. సీక్రెట్‌ను బయటపెట్టిన బొమ్మరిల్లు భాస్కర్

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్‌ చిత్రం అక్టోబర్ 15వ తేదీన రిలీజ్ కానున్నది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్ఫణలో రూపొందిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సినిమా ఈవెంట్‌లో బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ..

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా జీఏ2 బ్యానర్‌పై నిర్మాత అల్లు అరవింద్ ఆశీర్వాదంతో ప్రారంభమైంది. ఆయన సపోర్టు ఉంది. సినిమాను చాలా బాగా తీశామనే నమ్మకం ఉంది. ఈ ఫంక్షన్‌కు నాగచైతన్య రావడం చాలా హ్యాపీగా ఉంది. అక్కినేని హీరోలకు ఎప్పుడు వారి ఫ్యాన్స్ సపోర్టు ఉంటుంది. కాబట్టి అఖిల్‌ను మరింతగా ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాను అని దర్శకుడు భాస్కర్ తెలిపారు.

 Bommarillu Bhaskar about Pooja Hegde at Most Eligible Bachelor pre release event

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా షూటింగులో పూజా హెగ్డే మమల్ని ఆశ్చర్యానికి గురిచేసే విధంగా నటించింది. ఈ సినిమాలో కొత్త పూజా హెగ్డేను చూస్తారు. అద్భుతమైన ఫెర్పార్మెన్స్‌తో మిమ్మల్ని మెప్పిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను బయటపెట్టాలని అనుకొంటున్నాను. బొమ్మరిల్లులో హాసిని పేరు నా పెద్ద కూతురు పేరు. ఇక ఈ సినిమాలో నా రెండో బిడ్డ పేరును విభ పూజాహెగ్డేకు పెట్టాం. ఈ క్యారెక్టర్‌కు ధైర్యంగా నా కూతురు పేరును పెట్టాను. ఈ కథ చిన్న కోపం నుంచి పుట్టింది. ఈ దేశం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నది. అయితే పిల్లలకు కొన్ని విషయాలను నా పేరెంట్స్ నేర్పలేదు. ఈ సినిమా ద్వారా బ్యాచ్‌లర్స్ కొన్ని విషయాలు చెప్పాలని అనుకొంటున్నాను అని భాస్కర్ అన్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ సినిమా విషయంలో బన్నీ వాసుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు చాలా సహకారం అందించారు. నా సాంకేతిక నిపుణులు నాకు మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ఈ సినిమా కథను కోపంతో రాశావు. ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు అనే విషయాన్ని బన్నీ వాసు చెప్పారు.

ఇక ఈ సినిమా మ్యూజికల్ డైరెక్టర్ గోపి సుందర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు నాకు ఓ మ్యూజిక్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాడని ఈ వేదిక మీద నుంచి చెబుతున్నాను. అతనే బన్నీ వాసు. నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X