twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్లపై బ్ర‌హ్మాజీ సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నా కూడా!!

    |

    తెలుగు సీనియర్ నటుడు బ్ర‌హ్మాజీ హీరోయిన్లను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. కరోనా కట్టడిలో భాగంగా హీరోయిన్ల నుంచి ఆర్థిక సాయం అందకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

    కరోనా కష్టాలు.. దేశంలో కూలీల దుస్థితి

    కరోనా కష్టాలు.. దేశంలో కూలీల దుస్థితి

    కరోనా విజృంభణ నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి సామాజిక దూరం ఒక్కటే సరైన పరిష్కారం అని భావించిన ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో దినసరి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. చేతిలో చిల్లిగవ్వ లేక అష్టకష్టాలు పడుతున్నారు.

     సీఎం, పీఎం సహాయనిధికి విరాళాలు.. టాలీవుడ్ హీరోలు

    సీఎం, పీఎం సహాయనిధికి విరాళాలు.. టాలీవుడ్ హీరోలు

    ఈ పరిస్థితి చూసి ప్రభుత్వం పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. ప్రభుత్వంలో పాటు పలువురు వ్యక్తులు, స్వచ్చంద సంస్థలు సైతం ముందుకొచ్చి ప్రభత్వానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. సీఎం, పీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు టాలీవుడ్ సినీ హీరోలు సైతం పెద్ద ఎత్తున ఆర్థిక సాయం ప్రకటించారు.

    కరోనా క్రైసిస్ ఛారిటీ.. కదిలిన టాలీవుడ్ లోకం

    కరోనా క్రైసిస్ ఛారిటీ.. కదిలిన టాలీవుడ్ లోకం

    ఇకపోతే కరోనా ప్రభావిత సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఓపెన్ చేసి పేదలకు నిత్యావసర వస్తువులు అందిస్తూ అండగా ఉంటోంది టాలీవుడ్. ఈ 'సీసీసీ'కి సైతం బ్రహ్మాజీ సహా పలువురు హీరోలు, దర్శకనిర్మాతలు ఆర్థిక తోడ్బాటు అందించారు.

    కరువైన హీరోయిన్స్ మద్దతు.. బ్రహ్మాజీ కౌంటర్స్

    కరువైన హీరోయిన్స్ మద్దతు.. బ్రహ్మాజీ కౌంటర్స్

    తెలుగు సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి ఏర్పాటు చేసిన ఈ 'కరోనా క్రైసిస్ ఛారిటీ'కి హీరోయిన్స్ నుండి మాత్రం పెద్దగా మ‌ద్ద‌తు లభించడం లేదు. లావ‌ణ్య త్రిపాఠి, ప్రణీత లాంటివారు తప్పితే మిగితా హీరోయిన్స్ నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లను ఉద్దేశిస్తూ బ్రహ్మాజీ కొన్ని కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

    స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నా..!!

    స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నా..!!

    ముంబైకి చెందిన చాలా మంది హీరోయిన్స్ ఇక్క‌డ ప‌నిచేస్తున్నారని, అంద‌రూ స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నా.. వారెవ‌రూ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన చారిటీ కోసం స్పందించ‌క పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉందని బ్రహ్మాజీ అన్నాడు. దీంతో బ్ర‌హ్మాజీ అన్న మాట‌ల్లోనూ నిజం లేక‌పోలేదనే టాక్ ముదిరింది.

    English summary
    The 21 Days Lock down to control Corona Virus outbreak leads to stop all activity in the Film industry. Corona Crisis Charity take step to help the poor people. Now on this issue Brahmaji commented telugu heroines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X