twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణం రాజుకు అపురూపమైన బహుమతి ఇచ్చిన బ్రహ్మానందం..థ్యాంక్యూ ఫర్‌ ది స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ అంటూ ఆయన ట్వీట్!

    |

    టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం స్వతహాగా హాస్య నటుడే కాక చేయితిరిగిన కళాకారులు కూడా. ఆయన తన ఖాళీ సమయాల్లో ఒక కాగితం పెన్సిల్ పట్టుకుని తనకు నచ్చిన బొమ్మలు గీస్తూ ఉంటారు. అలా గీసిన ఒక బొమ్మను ఆయన రెబల్ స్టార్ కృష్ణం రాజుకు బహుమతిగా ఇవ్వగా ఈ విషయాన్ని రెబల్ స్టార్ కృష్ణంరాజు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే

    రెండు కళ్ళూ చాలవు

    రెండు కళ్ళూ చాలవు

    కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆహనా పెళ్ళంట సినిమాతో బ్రేక్ అందుకున్న బ్రహ్మానందం ఆ తర్వాత దాదాపు 1000 కి పైగా సినిమాలలోనటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. అంతటి గొప్ప హాస్యనటుడు ఒక మంచి కళాకారుడు కూడా. ఆయన తీసిన బొమ్మలు చూడడానికి రెండు కళ్ళూ చాలవు.

    బహుమతిగా

    బహుమతిగా

    తాజాగా అలా సాయిబాబా చిత్ర పటం గీసి దానిని రెబల్ స్టార్ కృష్ణంరాజు కు బహుమతిగా అందించారు ఆయన. శనివారం ఉదయం కృష్ణంరాజు నివాసానికి వెళ్ళిన బ్రహ్మానందం కృష్ణంరాజు దంపతులతో కొద్ది సేపు మాట్లాడిన తర్వాత తాను గీసిన షిరిడి సాయిబాబా చిత్రపటాన్ని కృష్ణంరాజు దంపతులకు బహుమతిగా అందించారు.

    థ్యాంక్యూ

    థ్యాంక్యూ


    బ్రహ్మానందం ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని ఊహించని కృష్ణంరాజు ఆనందం వ్యక్తం చేస్తూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు. ''మన కామెడీ జీనియస్‌.. ఆర్ట్‌లోనూ జీనియస్సే. అద్భుతమైన టాలెంట్‌ కలిగిన మంచి వ్యక్తి మన బ్రహ్మానందం. థ్యాంక్యూ ఫర్‌ ది స్పెషల్‌ సర్‌ప్రైజ్‌''అని ట్వీట్ చేశారు. అయితే బ్రహ్మానందం ఇలా బొమ్మ గీసి ఇవ్వడం ఇదే మొదలు కాదు..

    అంతకు ముందు కూడా

    అంతకు ముందు కూడా


    గతంలో కూడా బ్రహ్మానందం పలువురి హీరోలకు తాను స్వయంగా గీసిన చిత్రపటాలు బహూకరించారు. వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ వేసి చిరంజీవి, రానా, అల్లు అర్జున్ లకి ఆయన బహుకరించారు. ఖాళీ స‌మ‌యం దొరికితే చాలు పెయింటింగ్ పై కాన్సన్ ట్రేట్ చేస్తుండే బ్రహ్మానందం అనారోగ్యం కారణంగా కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' మూవీలో నటిస్తున్నాడు.

    వారి కారణంగా

    వారి కారణంగా

    బ్రహ్మానందం తండ్రి ఒక చిత్రకారుడు, శిల్పి. బ్రహ్మానందం అన్నయ్యలు కూడా కొంత మంది చిత్రకారులుగా ఉన్నారు. వారి ప్రభావంతోనే చిత్రలేఖనం పై బ్రహ్మానందంకు ఆసక్తి ఏర్పడిందట. అలా ఆరో తరగతి చదివే రోజుల నుంచి బొమ్మలు వేయడం ప్రారంభించిన బ్రహ్మీ జోసఫ్‌ అనే డ్రాయింగ్‌ మాస్టారు తనను ప్రోత్సహించారని గతంలో చెప్పారు.

    వదల బొమ్మాళీ అంటూ

    వదల బొమ్మాళీ అంటూ


    ఇక బ్రహ్మానందం వేసిన మొదటి బొమ్మ మహాత్మాగాంధీ కాగా స్కూల్లో, కాలేజీలో డ్రాయింగ్‌ పోటీలు ఎప్పుడు జరిగినా ఫస్ట్ ప్రైజ్ నాదేనని ఆయన గతంలో చెప్పారు. అప్పట్లో చిత్రలేఖనానికి అంతగా ప్రాముఖ్యత లేదనే ఉద్దేశంతో బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అని లక్ష్యంగా ఉందని అలా చదివి ఉద్యోగం తెచ్చుకున్నాక సినీ రంగ ప్రవేశం జరిగిందని చెప్పారు. అయితే అయితే చిత్రలేఖనాన్ని తాను పట్టించుకోకపోయినా చిత్రలేఖనం మాత్రం తనతో సహజీవనం చేసిందని బ్రహ్మానందం అంటూ ఉంటారు.

    English summary
    Brahmanandam presented a special gift to Krishnam Raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X