twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్లను కట్టిపడేయం.. ఈ కథ ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది.. బన్నీవాసు కామెంట్స్

    |

    గీతా ఆర్ట్స్ 2ను స్థాపించి చిన్న సినిమాలను, యువతకు అవకాశమిస్తుంది అల్లు వారి కాంపౌండ్. ఈ క్రమంలోనే జీఏ2 నుంచి విభిన్నమైన కథా చిత్రాలు పుట్టికొస్తున్నాయి. చివరగా వచ్చిన టాక్సీవాల ఈ బ్యానర్‌లో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి ప్రతిరోజూ పండగే అనే మూవీ రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఈ మూవీ నిర్మాత బన్నీ వాసు మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను వెల్లడించాడు.

    ఈ కథ ఒకే చేయడానికి కారణం మా అమ్మ..

    ఈ కథ ఒకే చేయడానికి కారణం మా అమ్మ..

    మొదటగా ఈ కథ చెప్పినప్పుడు తనకు నచ్చలేదని, అయితే ఓ రోజు తన తల్లి ఫోన్ చేసిందని, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని అడిగినట్టు తెలిపాడు. తనకు ఫోన్ ఎక్కువగా వాడటం ఇష్టం ఉండదని, మిస్డ్ కాల్స్ చూసుకోనని, అందులో తన అమ్మ మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయని అన్నాడు. అప్పుడు తనకు ఓ ఆలోచన వచ్చిందని, అందరిలానే తానూ పేరెంట్స్‌ని నిర్లక్ష్యం చేస్తున్నానేమోననిపించింది.

    అదే విషయం అమ్మను కూడా అడిగానని తెలిపాడు. పెద్ద వారు అయ్యారని, ఎవరి పనుల్లో వారుంటారని, ప్రతీ చిన్న విషయానికి డిస్టర్బ్ చేయడం ఎందుకని, ఎప్పుడో అలా ఫోన్ చేస్తామని చెప్పుకొచ్చినట్టు తెలిపాడు. అప్పుడు మారుతికి ఫోన్ చేసి ఈ కథ ఓకే అని చెప్పానని అన్నాడు.

    ప్రతీ ఒక్కరికీ కనెక్ట్..

    ప్రతీ ఒక్కరికీ కనెక్ట్..

    ఈ చిత్రం ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని తెలిపాడు. చావును కూడా సెలెబ్రేట్ చేసుకోవాలని చెప్పడమే ఈ మూవీ ఉద్దేశ్యమని, చివరి రోజుల్లో కూడా తల్లిదండ్రులను సంతోషంగా ఉంచి.. వారిని ఆనందంగా సాగనంపాలని చెప్పడమే ఈ కథ అని అన్నాడు. ఈ కథను పూర్తిగా ఎమోషనల్‌గా కాకుండా అందులో ఎంటర్టైన్‌మెంట్‌ను జోడించాడు. అలా ఈ కథకు చేయడం కత్తి మీద సాము అని పేర్కొన్నాడు.

    డైరెక్టర్లను కట్టిపడేయం..

    డైరెక్టర్లను కట్టిపడేయం..

    డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చాం కదా అని వారిని కట్టిపడేయమని తెలిపాడు. వారికి అనుకూలంగా ఉండే వారితో చేయమని చెబుతామని, అయితే తమ వద్ద కథ ఒకసారి రెడీ అయి అంతా సెట్ అయితే రావాలని చెబుతామన్నాడు. మారుతి, తాను ఓ డైరెక్టర్, నిర్మాత అనే రిలేషన్ మెయింటెన్ చేయమని తెలిపాడు. ఫ్రెండ్స్‌లా ఉంటామని ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తామని చెప్పుకొచ్చాడు.

    తదుపరి ప్రాజెక్ట్‌లు..

    తదుపరి ప్రాజెక్ట్‌లు..

    గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ స్పీడ్ పెంచాయని తెలిపాడు. ప్రస్తుతం వీరి బ్యానర్‌లో జెర్సీ హిందీ రీమేక్, అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ మూవీ, నిఖిల్-సూర్యప్రతాప్ కాంబోలో ఓ చిత్రం అంతే కాకుండా కార్తికేయ హీరోగా చావు కబురు చల్లగా అనే సినిమాను కూడా ప్రారంభించామని తెలిపాడు. పరుశురామ్ ప్రస్తుతం నాగ చైతన్యకు కథ చెప్పాడని, హీరోకు కూడా నచ్చిందని తెలిపాడు.

    English summary
    Bunny Vasu Media Interaction About Prathi Roju pandage. Sai Dharam Tej And Raashi Khanna Are Main Lead. Maruthi Is Directing This Movie While Thaman Composing Music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X