నా వెంట్రుక కూడా పీకలేరు... తొక్కితే పడిపోతానా? బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్
బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం 'మిత్ర మండలి'. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు ఎమోషనల్‌గా మాట్లాడుతూ..
మిత్ర మండలి సినిమా బాగా వచ్చింది. దీపావళీకి చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేయదగిన సినిమా. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్నది. దర్శకుడు విజేందర్‌ను చూస్తే నాకు కుళ్తు. నాకే మంచి ఫ్రెండ్స్ ఉంటారని అనుకొనే వాడిని. విజ్జును చూస్తే ఆయన ఫ్రెండ్స్ అనుదీప్ లాంటి ఫ్రెండ్ ఉండటం గ్రేట్. ఆయన 20 రోజుల నుంచి మాతోనే ఉన్నాడు. ప్రతీ విషయంలో సహాయం చేస్తున్నాడు. ఆయనకు కల్యాణ్, ఆదిత్య హసన్ లాంటి ఫ్రెండ్స్ ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది అని బన్నీ వాస్ అన్నారు.

నిర్మాత విజయేందర్ రెడ్డితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంటుంది. డబ్బును పక్కన పెడితే.. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. చక్కటి మనసున్న వ్యక్తి. అందరూ బాగుండాలని కోరుకొంటాడు. దేవుడిని బాగా నమ్ముతాడు. భాను, కల్యాణ్ నిర్మాతలుగా మారడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో జీవన్ కామెడీకి పొట్ట నొప్పి పెడుతుంది. జీవన్ హాస్యానికి అందరూ పడి పడి నవ్వుతాడు. ఆయన కామెడీకి నవ్వకపోతే ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసు ఇచ్చేస్తాం అని బన్నీ వాస్ జోష్‌తో మాట్లాడారు.
సక్సెస్ జర్నీలో ఫెయిల్యూర్స్, ఎమోషన్స్ పార్ట్ అవుతాయి. మా ట్రైలర్ కింద కామెంట్స్ చూసి ఎక్కడ నవ్వాలో చెప్పమని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సభాముఖంగా నేను చెప్పేదేమిటంటే.. ఈ సినిమాకు రండి.. ప్రతీ నిమిషం నవ్వుతారు. మీరు ప్రతీ నిమిషం నవ్వకపోతే అప్పుడు కామెంట్ పెట్టండి. ఫస్ట్ సినిమా చూడండి. ఆతర్వాత కామెంట్ పెట్టండి. ఈ అక్టోబర్ 16వ తేదీన నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ సినిమాలు ఒకటిని మించి మరోటి ఆడాలని అని బన్నీ వాసు అన్నారు.
ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఆడాలని కోరుకొనే వాళ్లలో నేను ఒకడిని. ఒక సినిమాను తొక్కితే తప్ప, ఎదుటి వాడి సినిమాను ట్రోల్ చేస్తేనే తప్పుదు అంటే మీ ఖర్మ. దానికి ఎవరు చేయలేం. ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు. లేకపోతే చూడరు. డబ్బు పెట్టి ఓ సినిమాను ట్రోల్ చేస్తే నడవదు అనుకొంటే.. అది చిన్నపిల్లల మనస్తత్వం. ఇండస్ట్రీలో మనమంతా ఉన్నది ఎదగడానికి. కష్టపడి ఎదుగుదాం. ఓ సినిమా వస్తుందని నెగిటివ్ కామెంట్స్ చేస్తామనుకొంటే.. దానికి దేవుడు ఉన్నాడు. ఆయనే చూసుకొంటాడు అని బన్నీ వాసు అన్నారు.
కాంపిటీషన్‌లో యుద్ధం చేయాలనుకొంటాను. నేను ఎప్పుడూ ధర్మ యుద్ధం చేయాలనుకొంటాను. నేనైతే అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకొంటాను. బాగా ఉన్న సినిమా బాగా ఆడాలని కోరుకొంటాను. ఎందుకంటే.. 15 సినిమాలు చేస్తే.. అన్నీ ఆడాలనే రూల్ ఉండవు. ఒకటి ఆడకపోవచ్చు. వేరే సినిమా ఆడితే నేను హ్యాపీగా ఉంటాను. నా సినిమా ఆడినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాను. అందుకే నేను ఇన్ని సక్సెస్‌లు కొట్టానేమో అని బన్నీ వాసు ఎమోషనల్ అయ్యారు.
ఇండస్ట్రీలో ఏదో చేస్తే బన్నీ వాసు పడిపోతాడు. తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకొంటారేమో.. కానీ నా వెంట్రుక కూడా పీకలేరు. నా సంస్కారం ఎంతంటే.. వేరే చోట నుంచి వెంట్రుక పీకి ఇవ్వగలను. కానీ తలమీదనే ఎందుకు పీకుతున్నానంటే.. అది నా సంస్కారం. నా జర్నీలో ఎప్పుడూ పరుగెడుతూనే ఉంటాను. మీ గురించి ఆలోచిస్తే.. ఇక్కడే ఆగిపోతాను. నన్ను ట్రోలింగ్ చేసే వాళ్లకు కొంచెం డబ్బు పెట్టుకొని చేయండి. ఎందుకంటే.. పొగడటానికి తక్కువ డబ్బు పెట్టుకోవాలి. అవతలి వాడిని తిట్టే వాడికి ఎక్కువ డబ్బు పెట్టాలి. సినిమా రిలీజ్ తర్వాత ఎక్కువ ట్రోల్స్ చేయాలి. అందుకు మేము సిద్దంగా ఉన్నాం. సినిమా బాగుంటే ఆడుతుంది. లేకపోతే ఆడదు. పోటీలో అందరూ బాగుండాలని కోరుకొందాం అని బన్నీ వాసు అన్నారు.


Click it and Unblock the Notifications











