For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సర్కారు వారి 'పాట' లీక్.. ఆ ఇద్దరి మీదే అనుమానం.. కేసు నమోదు?

  |

  సర్కారు వారి పాట సినిమా నుంచి మొదటి సింగిల్ 14వ తేదీన విడుదల కావాల్సి ఉండగా సోషల్ మీడియాలో ముందే లీక్ అయింది. లీకేజీ వ్యవహారం మీద సంగీత దర్శకుడు తమన్ తన ఆవేదనని వ్యక్తం చేయగా ఇప్పుడు లీక్ చేసిన వారి మీద పోలీస్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

  ప్రమోషన్స్ కోసం

  ప్రమోషన్స్ కోసం

  మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో భారీ ఎత్తున స్టార్ నటీనటులు కూడా నటిస్తున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్ మీద యూనిట్ దృష్టి పెట్టింది.

  తమన్ ఆవేదన

  తమన్ ఆవేదన


  ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ పాట లీక్ అయిన వ్యవహారం మీద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎప్పుడూ ఎలాంటి పరిస్థితులకు బాధపడను కానీ ఎందుకో ఇంత కష్టపడి చేసిన పాటను ఇలా ఉపయోగం లేకుండా లీక్ చేయడం చాలా బాధ కలిగిస్తుందని చెప్పారు. వాడికి పని ఇస్తే ఇలాంటి పని చేస్తాడు అని అనుకోలేదు అంటూ తమన్ తన ట్విట్టర్ వేదికగా వాయిస్ నోట్ పంచుకున్నారు.

  సోషల్ మీడియాలో లీక్

  సోషల్ మీడియాలో లీక్

  దురదృష్టకర రీతిలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుంచి కళావతి అంటూ సాగే మొదటి పాట సోషల్ మీడియాలో లీక్ చేయబడింది. ఈ పాట ప్రోమో పాట లీక్ కావడానికి 2 రోజుల ముందు విడుదలైంది. ఫిబ్రవరి 14 న పూర్తి పాటను వినడానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ పాట ఎవరూ ఊహించని విధంగా విడుదల చేయడానికి రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ అందరూ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. పాట అద్భుతంగా ఉందని ఆనందించాలో లీక్ అయిందని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు మునిగిపోయారు.

   ఆ ఇద్దరి వల్లేనా?

  ఆ ఇద్దరి వల్లేనా?

  అయితే తాజా సమాచారం ఏమిటంటే ఈ పాట సోషల్ మీడియాలో లీక్ కావడానికి కారణమైన వారి మీద ఇప్పుడు పోలీసు కేసు బుక్ చేయబడింది. వారు శిక్ష అనుభవించకుండా స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించబడరని, వారు చేసిన పనికి కచ్చితంగా మూల్యం చెల్లించి తీరాల్సిందేనని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, దర్శకుడు పరశురామ్ వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో పని చేస్తున్న ఫణి మరియు తేజ అనే ఇద్దరు అనుమానితులుగా గుర్తించబడ్డారు. వీరు సర్కారు వారి పాటకు అసోసియేట్ డైరెక్టర్‌లుగా పనిచేశారు.

  Recommended Video

  SSMB 28 రెండో హీరోయిన్ వేట | Sarkaru Vaari Paata ఓవర్సీస్ రేంజ్ || Filmibeat Telugu
   ఒక రోజు ముందే

  ఒక రోజు ముందే

  మరో పక్క లిరికల్ వీడియో యొక్క కొత్త వెర్షన్ ప్రస్తుతం సిద్ధంగా ఉంది. మైత్రీ మూవీస్ మరియు టీమ్ లిరికల్ వీడియోను 13వ తేదీన విడుదల చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 13వ తేదీన కొత్త వీడియోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ 'కళావతి' ఒరిజినల్ మ్యూజిక్ వీడియోను 13వ తేదీ సాయంత్రం 4.05 ని.లకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇది ఓ క్లాసిక్ సాంగ్ గా నిలిచిపోతుందని పేర్కొంది. ఫిబ్రవరి 11న రిలీజైన సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. యూట్యూబ్లో 6.6 మిలియన్ల వ్యూస్ తో ఇప్పటికే ట్రెండింగ్లో ఉంది.

  English summary
  as we all know first single from Sarkaru Vaari Paata has been leaked in social media. police booked case on two people who are legally involved in this leakage issue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X