Don't Miss!
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Finance
Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చలపతిరావు జీవితం ఆ మూవీకి కథగా.. రవిబాబు పెళ్లి ప్రయత్నం.. ఈ చిత్రం పేరు ఏమిటంటే?
విలక్షణ నటుడు, నిర్మాత చలపతిరావు గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో భోజనం చేస్తూ కుప్పకూలిపోవడంతో ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారని డాక్టర్లు నిర్ధారించారు. ఆయన మరణావార్త వినగానే తెలుగు సినీ లోకం దిగ్బ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలో చలపతిరావు వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

కొడుకు దర్శకత్వంలో చివరి సినిమా
1966 లో నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్పూర్తితో నటుడిగా కొనసాగించారు. ఎన్టీఆర్ అంటే చలపతిరావుకు చెప్పలేనంత ఇష్టం. ఎన్టీఆర్‌తో సుదీర్గమైన అనుబంధం ఉంది. దాదాపు చలపతిరావు 1200 చిత్రాల్లో నటించారు. ఆయన ఇటీవల చివరిసారిగా అక్కినేని నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో కనిపించారు. ఆయన చివరి చిత్రాన్ని కుమారుడు రవిబాబు దర్శకత్వంలో చేశారు. ఆ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.

ఇందుమతితో వివాహం
ఇక చలపతిరావు వ్యక్తిగత జీవితానికి వస్తే.. కెరీర్ ఉన్నతస్థాయిలో ఉండగానే.. ఇందుమతి అనే అమ్మాయిని వివాహం చేసుకొన్నారు. చలపతిరావు, ఇందుమతి దంపతులకు రవి బాబు, మాలినిదేవీ, శ్రీదేవి సంతానం కలిగారు. అయితే జీవితం ప్రశాంతంగా సాగుతుందనే సమయంలో భార్య అగ్నిప్రమాదంలో మరణించడం చలపతిరావు జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది.

భార్య మరణం తర్వాత
భార్య ఇందుమతి మరణించిన తర్వాత తన కన్నబిడ్డలకు అన్నీతానై వ్యవహరించారు. పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొన్నారు. మరో యువతిని పెళ్లి చేసుకొంటే.. నా బిడ్డల పరిస్థితి ఏమౌతుందనే బెంగతో ఆయన రెండో వివాహానికి దూరంగా ఉన్నారనే విషయాన్ని తన సన్నిహితులు చెబుతారు. చాలా మంది రెండో వివాహం చేసుకోవాలని సూచించినా.. దాని జోలీకి వెళ్లకపోవడం చలపతిరావు వ్యక్తిత్వానికి, ప్రేమ, అప్యాయతలకు నిదర్శనమని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

రెండో పెళ్లి ప్రస్తావనను రిజెక్ట్
తన
తండ్రి
చలపతిరావు
ఒంటరితనాన్ని
చూసి
తట్టుకొలేక
కుమారుడు
రవిబాబు
పలుమారు
రెండో
పెళ్లి
ప్రస్తావన
తీసుకొచ్చారు.
అయితే
తన
కుమారుడి
కోరికను
సున్నితంగా
తిరస్కరించారు.
అయినా
పలుమార్లు
నాన్నకు
పెళ్లి
చేయాలని
ప్రయత్నాన్ని
చాలాకాలంపాటు
కొనసాగించారు.
అయితే
తండ్రికి
పెళ్లి
చేయాలనే
కోరికను
మాత్రం
రవిబాబు
తీర్చుకోలేకపోయాడు.
అయితే
తండ్రి
వదిలే
తుదిశ్వాస
వరకు
రవిబాబు
ఆయన
బాగోగులు
చూసుకొంటూ
ఉండటం
విశేషంగా
చెప్పుకోవాలి.

చలపతి, రవిబాబు కథను ఈవీవీ దర్శకత్వంలో
చలపతిరావు,
రవిబాబు
జీవిత
కథను
ఆధారంగా
చూసుకొని..
ప్రముఖ
దర్శకుడు
ఈవీవీ
సత్యనారాయణ
ఓ
చిత్రాన్ని
నిర్మించారు.
భార్య
వియోగంతో
ఒంటరైన
తండ్రికి
పెళ్లి
చేయాలనే
కొడుకు
ప్రయత్నాన్ని
కథగా
మలిచి
మా
నాన్నకు
పెళ్లి
అనే
సినిమాను
రూపొందించారు.
1997లో
వచ్చిన
ఈ
చిత్రంలో
రెబల్
స్టార్
కృష్ణంరాజు,
శ్రీకాంత్,
సిమ్రాన్,
అంబిక,
చలపతిరావు,
కోటా
శ్రీనివాసరావు,
ఎంఎస్
నారాయణ
తదితరులు
నటించారు.
ఈ
సినిమా
ద్వారానే
ఎంఎస్
నారాయణకు
అత్యంత
పాపులారిటీ
లభించింది.
ఆ
సినిమా
తర్వాత
ఎంఎస్
నారాయణ
బిజీగా
మారిపోయారు.
ఈ
సినిమాను
రోజా
మూవీస్
బ్యానర్‌పై
అర్జునరాజు
నిర్మించారు.