twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగుదనం ఉట్టిపడేలా.. రావి కొండల రావు మృతికి చంద్రబాబు, లోకేష్ సంతాపం

    |

    ప్రముఖ నటుడు, రచయిత, సినీ జర్నలిస్టు రావి కొండలరావు గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మరణించారు. ఛాతి నొప్పి రావడంతో సోమాజిగూడలోని వివేకానంద హాస్పిటల్ చేర్పించారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన పార్దీవ దేహాన్ని మోతీ నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అభిమానులు, సినీ ప్రముఖుల చివరిచూపు కోసం అక్కడే ఉంచుతారు. రావి కొండల రావు మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ సంతాపం ప్రకటించారు

    రావి కొండల రావు సేవలను స్మరించుకొంటూ చంద్రబాబు తన సంతాప ప్రకటనలో.. సీనియర్ నటులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కళాప్రపూర్ణ శ్రీ రావి కొండలరావు గారి మరణం విచారకరం. తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో, హాస్యాన్ని జోడించి ఆయన ప్రదర్శించే నటన ఆహ్లాదకరంగా ఉండేది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

    Chandra Babu Naidu condolences Raavi Kondala Rao, Nara Lokesh condolences Raavi Kondala Rao,

    టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసి.. సినీ, సాహిత్యరంగ‌ ప్ర‌ముఖుడు రావికొండ‌ల‌రావు మృతి తెలుగు చ‌ల‌న‌ చిత్ర‌రంగానికి తీర‌నిలోటు. ఐదు ద‌శాబ్దాలపాటు ప్రేక్ష‌కుల్ని త‌న న‌ట‌న‌తో అల‌రించిన రావికొండ‌ల‌రావు స్క్రీన్‌ప్లే ర‌చ‌యిత‌గా, స‌హ‌ నిర్మాత‌గా బ‌హుముఖ‌ రంగాల్లో త‌న‌సేవ‌లు అందించారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను అని అన్నారు.

    English summary
    Actor, Writer, Director, Journalist Raavi Kondala Rao died due to cardiac arrest. Raavi Kondala Rao is a film actor and writer who appeared in Telugu films and has acted in over 600 films. He is the husband of veteran actress Radha Kumari. Many film personalities are expressed condolences due his death. Apart from this Power Star Pawan Kalyan condolences to Ravi Kondala Rao death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X