twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా క్రైసిస్ ఛారిటీ.. మెంబర్స్‌గా ఉండేది వీరే.. ముందుండి నడిస్తున్న మెగాస్టార్‌

    |

    సినీ పరిశ్రమకు కష్టమొస్తే ముందుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిత్రసీమ అభివృద్దికై నిరంతరం ఆలోచిస్తూ.. ఇరు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాడు చిరంజీవి. ఇండస్ట్రీ పెద్దదిక్కుగా ఉన్న దాసరి నారాయణ రావు మరణంతో.. ఆ స్థానంలోకి చిరంజీవి వచ్చేశాడు. ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందుంటున్నాడు. చిన్న సినిమాల మనుగడపై దృష్టి పెట్టాడు. ఇలా ప్రతీ ఒక్క సమస్యపై స్పందిస్తున్నాడు.

    కరోనా కష్ట కాలంలోనూ..

    కరోనా కష్ట కాలంలోనూ..

    ప్రపంచ మంతా కరోనా దెబ్బకు గడగడలాడిపోతోంది. మన దేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. కరోనా ధాటికి చిత్ర సీమ ఎప్పుడో షట్ డౌన్ అయింది. అయితే టాలీవుడ్‌లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో.. రోజూవారి వేతనంపై ఆధారపడే కార్మికుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. దీంతో సీని శ్రామికులను ఆదుకునేందుకు చిరంజీవి ముందడుగు వేశాడు.

    కరోనా క్రైసిస్ ఛారిటీ..

    కరోనా క్రైసిస్ ఛారిటీ..

    షూటింగ్‌లు లేక, పని దొరకక ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ పేరిట ఓ ఛారిటీని ప్రారంభించాడు. తాను మొదటగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి.. అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మిగతా వారంత తమకు తోచిన సాయాన్ని చేయండని కోరాడు.

    వెల్లువెత్తిన విరాళాలు..

    చిరంజీవి పిలుపుతో సినీ తారలు కదిలి వచ్చారు. దగ్గుబాటి ఫ్యామిలీ కోటి, నాగార్జున కోటి, మహేష్ బాబు 25 లక్షలు, ఎన్టీఆర్ 25 లక్షలు, రామ్ చరణ్ 30 లక్షలు, వరుణ్ తేజ్ 20 లక్షలు, శర్వానంద్ 15 లక్షలు, రవితేజ 20 లక్షలు, దిల్ రాజు 10 లక్షలు, విశ్వక్‌సేన్ ఐదు లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు, నాగ చైతన్య 25 లక్షల విరాళాన్ని ప్రకటించారని చిరు తెలిపాడు.

    చారిటీకి మెంబర్స్‌ను నియమించిన చిరు..

    కరోనా క్రైసిస్ ఛారిటీ సినీ కార్మికులను ఆదుకోవాలని అందుకోసం నిర్ధిష్టమైన ఓ బాడీ ఉండాలని తెలిపిన చిరు.. తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సీ కళ్యాణ్, దాము, ఎన్ శంకర్, బెనర్జీ, మెహర్ రమేష్‌లను మెంబర్స్‌గా ప్రకటించాడు. ఎవరికి ఏ అవసరం ఏర్పడిన 9248077790, 9581900023 నంబర్లకు సంప్రదించండని చిరు ట్వీట్ చేశాడు.

    Recommended Video

    Trisha Revealed Allu Arjun's Secret Social Media Account
    ముందుండి నడిస్తున్న మెగాస్టార్‌..

    ముందుండి నడిస్తున్న మెగాస్టార్‌..

    కరోనా క్రైసిస్ చారిటీని ముందుండి నడిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవిక ధన్యవాదాలు తెలిపిన సుప్రీమ్ హీరో.. తన వంతుగా పది లక్షల విరాళాన్నిప్రకటించాడు. సినీ పరిశ్రమ మన కుటుంబం..అందులోని కార్మికులను కాపాడుకోవడాని ముందుకు రావాలని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు.

    English summary
    Chiranjeevi Announced Corona Crisis Charity Members.Tammareddy Bharadwaja, D.Suresh Babu, C.Kalyan, Damu, N.Shankar, BanerjeeMeher Ramesh Are Members Of CCC.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X