GodFather 2 గాడ్‌ఫాదర్ సీక్వెల్‌పై చిరంజీవి క్లారిటీ.. మెగాస్టార్‌కు డైరెక్టర్ ఇచ్చిన ట్విస్టు అదే!

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం గాడ్‌ఫాదర్. మలయాళంలో విజయవంతమైన లూసిఫర్ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందింది. నయనతార, సత్యదేవ్, గెటప్ శ్రీను, బ్రహ్మజీ తదితరులు నటించిన ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నది. ఈ సినిమా హిందీ ట్రైలర్ ఆవిష్కరణ జరిగిన సందర్భంగా ముంబైలో మీడియా క్వశ్చన్, ఆన్సర్ కార్యక్రమంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాట్లాడారు. మీడియా వారిద్దరి ఇచ్చిన సమాధానాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్‌తో నటించడం

సల్మాన్ ఖాన్‌తో నటించడం

సల్మాన్ ఖాన్‌తో నటించడంపై చిరంజీవి స్పందిస్తూ.. మా మధ్య ఎలాంటి ఇగోలు ఉండవు. ఎందుకంటే మేమిద్దరం సమకాలీకులం కాదు. ఇద్దరు సూపర్ స్టార్లను డీల్ చేసేటప్పుడు దర్శకుడు చాలా బ్యాలెన్స్‌గా వ్యవహరించాలి. ఇద్దరు స్టార్లకు ఎలాంటి విభేదాల రాకుండా పాత్రలను డిజైన్ చేయాలి. అప్పుడు పెద్ద హీరోల మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉండవు అని చిరంజీవి చెప్పారు.

మళ్లీ అండర్ వరల్డ్‌లోకి

మళ్లీ అండర్ వరల్డ్‌లోకి

లూసిఫర్ సినిమాకు సీక్వెల్ వస్తున్నది. అయితే గాడ్‌ఫాదర్ సినిమాకు సీక్వెల్‌గా ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు. కానీ ఇటీవల గాడ్‌ఫాదర్ ఫైనల్ కట్ చూస్తుంటే.. కొన్ని సినిమాకు సంబంధం లేని సీన్లు చివర్లో కనిపించాయి. అందులో ఇంటర్‌పోల్ నన్ను వెతుకుతున్న సీన్లు ఉన్నాయి. నేను మళ్లీ అండర్ వరల్డ్‌లోకి అడుగుపెట్టే సీన్లను దర్శకుడు మోహన్ రాజా యాడ్ చేశారు అని చిరంజీవి తెలిపారు.

స్వీకెల్స్‌కు అవకాశం ఉండేలా..

స్వీకెల్స్‌కు అవకాశం ఉండేలా..

అయితే చివర్లో కథకు సంబంధం లేకుండా సన్నివేశాలు ఉండటంతో దర్శకుడు మోహన్ రాజాను అడిగాను. అయితే ఏదైనా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నావా? అని అడిగితే.. ఏమో నాకు తెలియదు. ఏమో చెప్పలేం. ఏదైనా సీక్వెల్ తీయాల్సి వస్తే.. ఈ సన్నివేశాలు ప్లస్ అవుతాయని చెప్పాడు. ఇప్పటికప్పుడు మేము సీక్వెల్‌కు ప్లాన్ చేయడం లేదు. మున్ముందు ఏం జరుగుతుందో చెప్పలేం అని చిరంజీవి అన్నారు.

సౌత్‌లో సల్మాన్ ఖాన్ మరో సినిమా

సౌత్‌లో సల్మాన్ ఖాన్ మరో సినిమా

లూసిఫర్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ఇటీవల మాట్లాడాను. ఈ సందర్భంగా లూసిఫర్ సినిమా సీక్వెల్‌ స్క్రిప్టు బాగా వస్తున్నది. మీకు నచ్చితే సీక్వెల్ ప్లాన్ చేద్దాం. సీక్వెల్‌ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి.. గాడ్‌ఫాదర్ సినిమా సీక్వెల్ ప్లాన్ చేద్దామన్నాడు. రానున్న రోజుల్లో గాడ్‌ఫాదర్ సినిమాకు సీక్వెల్ రావడానికి అవకాశం ఉంది అని చిరంజీవి చెప్పారు. దాంతో నాకు సౌత్‌లో మరో సినిమా వస్తుందని సల్మాన్ అనడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

ది ఘోస్ట్ మూవీతో పోటీపై చిరంజీవి

ది ఘోస్ట్ మూవీతో పోటీపై చిరంజీవి

దసరా పండుగ సందర్భంగా గాడ్‌ఫాదర్ సినిమాతోపాటు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా రిలీజ్ అవుతున్నది. నాగ్, నేను మేమిద్దరం పోటీపడుతున్నామనే ఫీలింగ్ లేదు. పండుగ సమయంలో రెండు, మూడు సినిమాలకు స్కోప్ ఉంటుంది. మా ఇద్దరి సినిమాలు భారీ విజయం సాధించాలని ఒకరికొకరం కోరుకొంటున్నాం అని చిరంజీవి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X