For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా అప్‌డేట్ : పవన్ స్టైల్‌లో చిరంజీవి.. ఎర్రకండువాతో మెగాస్టార్ రచ్చ

  |

  మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతోన్న సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లింది. అంతా సవ్యంగా సాగి ఉంటే ఈపాటికే బాక్సాఫీస్ దద్దరిల్లేది. కొరటాల విజన్‌కు చిరు యాక్షన్‌కు రికార్డులన్నీ బ్రేక్ అయ్యేవి. కానీ కరోనా రాకతో అన్నీ తారుమారయ్యాయి. ఇక ఇలాంటి సమయంలో మళ్లీ అందరిలో ఉత్సాహాన్ని నింపేందుకు చిత్రయూనిట్ ఓ అప్డేట్‌ను ప్రకటించింది.

  మొదటి నుంచి అంతే..

  మొదటి నుంచి అంతే..

  కొరటాల శివ, చిరంజీవి కాంబోలో మొదలు పెట్టిన ఈ చిత్రానికి ఆది నుంచి అడ్డంకులే ఎదురువుతున్నాయి. ఈ క్రమంలో లీకులు, హీరోయిన్ వెనక్కి వెళ్లిపోవడం, రామ్ చరణ్ పాత్రపై తర్జనభర్జనలు జరగడం ఇలా ఎన్నెన్నో అవాంతరాలు వచ్చి పడ్డాయి. అన్ని ఒకెత్తు అయితే కరోనా వచ్చి షూటింగ్‌లు బంద్ కావడం మరో ఎత్తు.

   అలా లీక్..

  అలా లీక్..

  ఇక చిరు 152 చిత్రాన్ని ప్రారంభించి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి చిన్న అప్ డేట్ కూడా అధికారికంగా రాలేదు. హీరోయిన్‌గా త్రిషను ఫిక్స్ చేశారని, ఆమె చిత్రం నుంచి తప్పుకుంటోందని చెప్పే వరకు ఎవరికీ తెలీదు. ఇక సినిమా టైటిల్ సైతం ఓ పిట్ల కథ ఈవెంట్‌లో ఆచార్య అంటూ నోరు జారి అడ్డంగా బుక్కయ్యాడు.

  ఎన్నో తర్జనభర్జనలు..

  ఎన్నో తర్జనభర్జనలు..

  ఇక ఈ సినిమాలో కొన్ని పాత్రలపై నేటికీ ఓ క్లారిటీ రాలేదు. మొదటగా ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్ రోల్ అన్నారు. ఆపై రామ్ చరణ్ స్పెషల్ క్యారెక్టర్ అన్నారు.. మళ్లీ మహేష్ బాబు చేస్తారని టాక్ వచ్చింది. ఇక రామ్ చరణ్ తప్పుకున్నాడని చిరంజీవే ఆ క్యారెక్టర్‌నూ పోషిస్తారని అంంటున్నారు. ఇక హీరోయిన్‌గా కాజల్ మాత్రం ఫిక్స్ అయిందని టాక్. ఇలా ఎన్నో విషయాలు ఆచార్యను ఇబ్బంది పెడుతున్నాయి.

   చిరు బర్త్ గిఫ్ట్..

  చిరు బర్త్ గిఫ్ట్..

  అయితే చిరంజీవి బర్త్ ఆగస్ట్ 22న స్పెషల్ ట్రీట్ ఉండబోతోందని ఇప్పటికే సమాచారం అందింది. ఆచార్య అప్ డేట్ కాకుండా తన తదుపరి చిత్రాలకు సంబంధించిన ప్రకటనలు కూడా ఉండబోతోన్నాయని తెలుస్తోంది. అవన్నీ పక్కన బెడితే తాజాగా ఇచ్చిన అప్ డేట్ మాత్రం అదిరిపోయింది.

  బంగారు కోడిపెట్ట అంటూ అలనాటి తారలతో చిరు స్టెప్పులు.. వీడియో వైరల్
   మెగా అప్డేట్..

  మెగా అప్డేట్..

  ఇక కాసేపటి క్రితమే మెగా అప్డేట్‌ను ప్రకటించారు. చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న సాయంత్రం నాలుగు గంటలకు చిరు 152 ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. దంతో మెగా అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం నింపినట్టైంది.

  English summary
  Chirnajeevi Koratala Siva Acharya Update. Let's Assemble for #Chiru152 on AUG 22nd at 4 PM, This Movie Is Produced Under Konidela Production And Matinee.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X