Kapil Devతో చిరంజీవి దంపతుల భేటీ.. ఇంత సడన్ గా అందుకేనా?
గత కొద్ది రోజులుగా మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన దైనందిన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ వారిని ఆనందింపచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పీవీ సింధును ఒక ప్రైవేటు పార్టీలో సత్కరించిన ఆయన ఇప్పుడు ఏకంగా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ ఫోటోలను స్వయంగా చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.

చాలా కాలం తర్వాత
చాలా కాలం తర్వాత లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ హైదరాబాద్ లో సందడి చేశారు.. దీంతో ఈ సందర్భంగా కపిల్ దేవ్ తో చిరంజీవి, చిరంజీవి భార్య సురేఖ కలిసి ఉన్న ఫోటోలు చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఫలక్నామా ప్యాలెస్ లో వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాలు, ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న చిరంజీవి చాలా కాలం తర్వాత నా స్నేహితుడు కపిల్ దేవ్ ని కలవడం ఆనందంగా ఉంది.

అక్కడ మీటింగ్
ఈ ఫేమస్ ఫలక్నామ ప్యాలెస్ మీటింగ్ ని మరింత ఉన్నతంగా మార్చింది'' అని పేర్కొన్నారు. ఈ మీటింగ్ లో అనేక విషయాలు చర్చించుకోవడంతో పాటు అనేక పాత జ్ఞాపకాలు కూడా నెమరు వేసుకుంన్నామని హర్యానా హరికేన్ గా పిలువబడే కపిల్ దేవ్ దేశానికి మొదటి వరల్డ్ కప్ అందించిన క్రికెట్ టీం కి కెప్టెన్ గా వ్యవహరించారు అని గుర్తు చేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు.

పాత స్నేహితులా?
అయితే వీరిద్దరి మధ్య స్నేహం ఉందనే విషయం బయటకు అంతగా ఎక్స్పోజ్ కాలేదు కానీ చిరంజీవి చేసిన ఈ ట్వీట్ తో మాత్రం వీరిద్దరి మధ్య పాత స్నేహం ఉందనే విషయం బయటకు తెలిపింది. ఇక కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే రణవీర్ సింగ్ హీరోగా 83 అనే టైటిల్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. 1983 సంవత్సరంలో కపిల్ దేవ్ ఆధ్వర్యంలో భారత క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకుంది.

బిజీబిజీగా
ఆ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారు. అయితే కపిల్ దేవ్ హైదరాబాద్ ఎందుకు వచ్చారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక మరోపక్క చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కాగా కేవలం రెండు సాంగ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి
Recommended Video
ఎందుకు కలిశారబ్బా?
ఆ షూటింగ్ కూడా పూర్తయిన వెంటనే గాడ్ ఫాదర్, బోలా శంకర్ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక వీరి భేటీకి కారణం ఏమిటి అనే విషయం మీద కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఏదైనా ఒక శుభ సందర్భంగానే వీరు కలిసి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. కొందరు అయితే ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మరి చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇస్తే గాని ఆ శుభ సందర్భం ఏమిటి అనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications











