twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మాయిని వేధిస్తూ అలాంటి ఫోటోలు.. అసలు విషయం తెలిసి షాక్.. కొరియోగ్రాఫర్ అరెస్ట్?

    |

    ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. ఏదో ఒక విధంగా అమాయకులను మోసం చేసి డబ్బు కొట్టేస్తున్న ముఠాలు కొన్ని అయితే అమ్మాయిల ఫోటోలను సేకరించి వాటిని అసభ్యకరంగా మార్చి సర్క్యులేట్ చేస్తున్న కేటుగాళ్లు కొందరు తయారయ్యారు. ఇప్పటికే ఇలాంటి చాలా మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినా వారిలో మార్పు రావడం లేదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఇలాంటి నేరాలు చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక అమ్మాయిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. సదరు కేటుగాడు ఇంస్టాగ్రామ్ లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఒక అమ్మాయి అసభ్య ఫోటోలు వీడియోలు పెడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

    తాను కొరియోగ్రాఫర్ ని అని చెప్పుకుంటున్న మణి ప్రకాష్ అనే ఒక యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ యువకుడు కొరియోగ్రాఫర్ ని అని చెప్పుకుంటూ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది.. అలా 2020 లో ఒక షార్ట్ ఫిలిం చేయగా ఇందులో నటించడానికి ఒక అమ్మాయి కాంటాక్ట్ అయింది. ఇక సదరు షార్ట్ ఫిలింకి డైరెక్టర్ గా వ్యవహరించిన ప్రకాష్ షూటింగ్ సమయంలో ఆ అమ్మాయికి తెలియకుండా కొన్ని అసభ్యకర ఫోటోలు చిత్రీకరించినట్లు సమాచారం. అయితే ఇవి తన వద్ద ఉన్నాయనే సంగతి ఎప్పుడూ మణిప్రకాష్ సదరు అమ్మాయికి వెల్లడించలేదు.

    choreographer mani kumar arrested in cyber crime case hyderabad

    కానీ అప్పటి నుంచి బాగానే ఉన్న ఇద్దరి మధ్య ఈ మధ్య కాలంలో మనస్పర్థలు రావడంతో ఆ అమ్మాయి ప్రకాష్ తో మాట్లాడటం మానేసింది. దీంతో కొన్నాళ్ళపాటు అమ్మాయిని మాట్లాడమని ప్రాధేయపడినా ఇక వినేలా లేదని భావించి ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు పోస్ట్ చేశాడు. ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కాని సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.. హైదరాబాద్ సైబర్ సెల్ టీం సమర్థవంతంగా పని చేసి సదరు కేటుగాడు మణి ప్రకాష్ అని గుర్తించి అతనిని అరెస్టు చేశారు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది.

    English summary
    Hyderabad based choreographer named Mani Kumar is arrested for creating a fake profile and posting abuse photos and videos of a girl. Mani Kumar who worked with girl last year for short film taken some abusive photos and videos of that girl. After some disturbances between them, he used to post all those abusing photos and videos by creating a fake profile. the girl approached cyber crime police after the investigation police arrested mani Kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X