సీఎంతో రౌడీ స్టార్.. మూడున్నరేళ్ల క్రితం నేను ఎవరిని.. ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ రౌడీ స్టార్, సెన్సేషనల్ స్టార్ ఇలా ఏ పేరుతో, ఏ ట్యాగ్‌తో పిలిచినా.. అందరి చూపు విజయ్ దేవరకొండ వైపే తిరుగుతుంది. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్, యాటిట్యూడ్, మ్యానరిజాన్ని క్రియేట్ చేసుకుని.. యూత్‌లో ఫుల్ క్రేజ్‌ తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చినా.. అర్జున్ రెడ్డి చిత్రం సెన్సేషనల్ స్టార్‌ను చేసేసింది. టాలీవుడ్ మొత్తం విజయ్ నటనను కొనియాడింది. ఆపై గీతాగోవిందం, నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ అంటూ అందర్నీ మెప్పించాడు.

దక్షిణాదిపై పట్టు కోసం..

దక్షిణాదిపై పట్టు కోసం..

టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న విజయ్.. మొత్తం సౌత్‌పై కన్నేశాడు. డియర్ కామ్రేడ్‌తో ఆ ముచ్చటా తీర్చుకుందామని ప్రయత్నాలు చేశాడు. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. అయితే విజయ్ బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా ఓ టాక్ నడుస్తోంది.

బాలీవుడ్‌లో విజయ్ క్రేజ్..

బాలీవుడ్‌లో విజయ్ క్రేజ్..

డబ్బింగ్ రూపంలోనైనా బాలీవుడ్ తెరపై కనిపించని విజయ్‌కు అక్కడ విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. యంగ్ హీరోయిన్స్ సైతం విజయ్‌తో నటించాలని, అతనంటే ఇష్టమని బాహాటంగానే ప్రకటించారు. జాన్వీ కపూర్, కియారా అద్వాణీ, అలియా భట్ లాంటి వారు విజయ్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

ప్రపంచ ప్రసిద్ద ప్రేమికుడు..

ప్రపంచ ప్రసిద్ద ప్రేమికుడు..

ప్రస్తుతం విజయ్.. వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీలో నలుగురితో రొమాన్స్ చేయనుండగా.. తన లవర్స్‌ను ఒక్కొక్కరిగా అందర్నీ పరిచయం చేశాడు. వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈచిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, రాశీ ఖన్నా, క్యాథరిన్, ఇసబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కేసీఆర్‌ చేతుల మీదుగా అవార్డు..

ప్రముఖ టీవీ చానెల్ 'నవ నక్షత్ర సన్మానం' అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ చేతుల మీదుగా విజయ్ దేవరకొండ ఓ అవార్డు అందుకున్నాడు.గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వేదికను పంచుకోవడం, ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని విజయ్ అన్నాడు.

మూడున్నరేళ్ల క్రితం..

మూడున్నరేళ్ల క్రితం..

మూడున్నరేళ్ల క్రితం.. నేను ఎవరిని..? పెళ్లి చూపులు సినిమాతో ఎంట్రీ ఇచ్చాను.. అనంతమైన అవకాశాలు.. రాబోయే ఏడాది ఏం జరుగుతుందో చూద్దాం. అంంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. మరి మిగతా ఎనిమిది మంది సెలెబ్రిటీలు ఎవ్వరో కూడా తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X