For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా కూతురి పెళ్లికి పవన్ అందుకే రాలేదు.. అల్లుడికి అన్ని కోట్ల ఆస్తులు: ఆలీ క్లారిటీ

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్లపాటు కమెడియన్ గా కొనసాగిన ఆలీ వేల సినిమాలలో నటించాడు. ఇక భాషతో సంబంధం లేకుండా కూడా ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును అందుకున్నాడు. అయితే అలీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా బిజీ కాబోతున్నాడు. అయితే రాజకీయ కారణాల వలన అలీ పవన్ కళ్యాణ్ మధ్యలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ విభేదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయని అని కూడా టాక్ వచ్చింది. అంతేకాకుండా ఆలీ తన కూతురి పెళ్లికి కూడా పిలవలేదు అని మరొక టాక్ అనిపించింది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలీ పవన్ కళ్యాణ్ తన కూతురు పెళ్లికి ఎందుకు రాలేదు అనే విషయంలో కూడా ఒక వివరణ ఇచ్చాడు.

  సినిమాల్లోకి రాకముందే..

  సినిమాల్లోకి రాకముందే..

  కమెడియన్ ఆలీ పవన్ కళ్యాణ్ అనుబంధం ఇప్పటిది కాదు. పవన్ కళ్యాణ్ హీరో కాకముందు నుంచి ఆలీకి ఎంతో మంచి స్నేహితుడు. అతని ప్రతీ సినిమాలో అలీ నటిస్తూ వచ్చాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సన్నివేశం కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది అని ప్రేక్షకులకు బలతమైన నమ్మకం కూడా ఏర్పడింది. అయితే పలు రాజకీయాల కారణాల వలన అప్పట్లో వీరి మధ్య కొంత మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే.

  ఎలాంటి కోపం లేదు

  ఎలాంటి కోపం లేదు

  ఇక కమెడియన్ ఆలీ చాలా ఇంటర్వ్యూలలో వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద తనకు ఎలాంటి కోపం లేదు అని ఇప్పుడు కూడా అతనితో మంచి స్నేహం సంబంధాలు ఉన్నాయని.. అలానే ఉంటాయని కూడా తెలియజేశాడు. అయితే ఇటీవల ఆలీతో సరదాగా చివరి ఎపిసోడ్ లో మళ్ళీ పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధం గురించి మరొకసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

  పెళ్లికి పిలవడానికి వెళ్ళాను

  పెళ్లికి పిలవడానికి వెళ్ళాను

  ఆలీతో సరదాగా షోకు కొంత గ్యాప్ తీసుకుంటున్నట్లుగా చెబుతున్న ఆలీ పవన్ కళ్యాణ్ తో ఎలాంటి విభేదాలు లేవు అని ఇప్పటికి కూడా తాము చాలా స్నేహపూర్వకంగానే మాట్లాడుకుంటున్నాము అని అన్నాడు. తన కూతురి పెళ్లి సందర్భంగా పిలవడానికి ఆయన దగ్గరకు వెళ్లాను. సినిమా సెట్ లో ఉన్నప్పుడు ఆయన నన్ను ఎంతో మర్యాదపూర్వకంగా చూసుకున్నారు. షూటింగ్లో ఉన్నప్పుడు ముందుగానే ఆలీ గారు వస్తే కూర్చోబెట్టి టీ కాఫీలు ఏమైనా కావాలంటే చూసుకోండి అని కూడా తన అసిస్టెన్స్ కు చెప్పాడని ఆలీ తెలియజేశాడు.

  ఎందుకు రాలేదంటే..

  ఎందుకు రాలేదంటే..

  ఇక నేను షూటింగ్ స్పాట్ కు వెళ్ళగానే పవన్ కళ్యాణ్ ఒక అరగంట తర్వాత నన్ను కలిసి మాట్లాడటం జరిగింది. నేను పెళ్లికి కూడా తప్పకుండా వస్తాను అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. అయితే పెళ్లికి రావడానికి ఆయన దాదాపు సిద్ధమైపోయారు. నా మేనేజర్స్ కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. అయితే ఆ రోజు పెళ్లి రోజు ఫ్లైట్ కాస్త ఆలస్యం కావడంతో మొత్తం ప్లాన్ మారిపోయింది. దీంతో ఆ కారణంగా ఆయన ఆరోజు పెళ్లికి రాలేకపోయారు. అంతే తప్పితే ఆయన కావాలని దూరం కాలేదు.. ఈ విషయంలో ఎన్నో ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు. వాటితో తమకు సంబంధం లేదు అని వివరణ ఇచ్చాడు.

  అల్లుడికి కట్న, కానుకలు

  అల్లుడికి కట్న, కానుకలు

  అయితే ఆలీ తన అల్లుడు గురించి మాట్లాడుతూ.. వారిది డాక్టర్స్ కుటుంబం అని అల్లుడు మాత్రం డాక్టర్ కాదు అని రోబోటిక్ ఇంజనీర్ అని వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన అల్లుడికి 10 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని చాలామంది వార్తలు వ్రాశారు. అయితే ఆ విషయంపై కూడా సరదాగా కామెంట్ చేసిన ఆలీ అవును చాలా కోట్లు ఉన్నాయి అని నేను కూడా ఇప్పుడు ఒక కోట్ వేసుకొని వచ్చాను అని అన్నాడు. అయితే నాకు ఉన్నంతలో నా కూతురికి ఇవ్వాల్సినవి నేను ఇచ్చాను.. అని ఆలీ కట్న కానుకల గురించి కూడా ఒక మాటలో వివరణ ఇచ్చేశాడు. మంచి కుటుంబం కాబట్టి మా అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది, అంతేకాని ఆస్తుల గురించి చూసి కాదు అని.. ఆలీ మరో వివరణ ఇచ్చారు.

  English summary
  Comedian ali clarification on why pawan kalyan not attend his daughter marriage,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X