Don't Miss!
- News
మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి..: ఏం చేశాయంటూ కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ ఫైర్
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో అలీ.. టాప్ కమెడియన్ క్లారిటీ ఏమిటంటే?
కమెడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు అందుకున్న ఆలీ ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక గత ఎన్నికల్లో ఆ పార్టీ కోసం ప్రచారాలు కూడా చేసిన ఆలీ జగన్ గెలిచిన తర్వాత కూడా ప్రత్యేకంగా కొన్నిసార్లు కలిశారు. అయితే చాలా రోజుల తర్వాత ఆ పార్టీ నుంచి ఆలీకి ఒక ప్రత్యేకమైన ఆఫర్ అయితే వచ్చింది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే.

సొంత నిర్ణయమే..
40 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న కమెడియన్ ఆలీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు అందుకున్నాడు. అయితే గతంలోనే చాలాసార్లు అతను రాజకీయాల్లోకి రావాలి అని కొన్ని పార్టీలు ఆఫర్ చేశాయి. కానీ ఆలీ మాత్రం నటుడిగా బిజీగా ఉన్న సమయంలో పాలిటిక్స్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు. ఇక వైసీపీ పార్టీ నచ్చడంతో సొంత నిర్ణయంతోనే అందులోకి వెళ్లినట్లు ఆలీ చెప్పారు. ఇప్పుడు వైసీపీ పార్టీలో అతను కీలక బాధ్యతతో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

త్వరలోనే ఆ బాధ్యతలు
ఇటీవల సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సినీ నటులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన బాధ్యతలను అప్పగించింది. ఇక ఇప్పుడు కమిడియన్ ఆలీకి ఏపీ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైసర్ గా కొత్త బాధ్యతలను అప్పగించారు. ఇటీవల కూతురి వివాహం ఉండడం వలన ఇంకా అధికార బాధ్యతలు తీసుకోలేదని ఇప్పుడు త్వరలోనే వైసీపీ అధినేతల మధ్యలో తన బాధ్యతలను తీసుకోబోతున్నట్లు చెప్పాడు.

పార్టీ టిక్కెట్
వైసీపీలో మొదట తనకు ఎలాంటి ఆఫర్ ఇస్తానని చెప్పలేదు అని ముందుగా పార్టీలో వర్క్ చేసిన తర్వాత వారే గుర్తించి తనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లుగా చెప్పారు. ఇక మొదట్లోనే పార్టీ టిక్కెట్ లాంటివి అడుగుకూడదు అనుకున్నాను. ముందుగా మనం ఏం చేస్తామో అది పార్టీ గుర్తిస్తుంది. ఆ తర్వాత వారికి నిర్ణయం ప్రకారం నడుచుకుంటే చాలా బాగుంటుంది అని కూడా ఆలీ వివరణ ఇచ్చాడు.

అలాంటి ఛానెల్స్ విషయంలో..
ఇక ఈ బాధ్యతలో తను కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని.. ఏకపక్షంగా వ్యవహరించే చానల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ విషయాలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని పార్టీ ఏదైతే చెబుతుందో దాని ప్రకారం నడుచుకుంటానని కూడా ఆలీ అన్నాడు. తప్పకుండా తన వృత్తికి న్యాయం చేయాలని చూస్తానని కూడా అన్నారు.

పోటీ చేయడానికి సిద్ధమే
అలాగే ఆలీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేదా అనే విషయంపై కూడా తనదైన శైలిలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పార్టీ పలానా దగ్గర నుంచి పోటీ చేయమంటే తప్పకుండా పోటీ చేయడానికి సిద్ధమే అని కూడా అన్నారు. ఇంకా టికెట్ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని అది రాగానే తప్పకుండా చెబుతాను అని కూడా ఆలీ వివరణ ఇచ్చాడు. ఇక ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి అని అలీ తెలియజేశారు.