For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోహన్ బాబుకు దారుణ అవమానం.. తినే పళ్ళెంలో అంటూ సీక్రెట్ బయటపెట్టిన అలీ

  |

  తెలుగు ప్రేక్షకులకు మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన తెలుగులో సినిమా నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాతగా కూడా మారారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి కూడా వచ్చిన ఆయన కొన్నాళ్లు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. అయితే ఆయన తన జీవితంలో ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని తాజాగా నటుడు అలీ ప్రస్తావించారు. ఒక షోలో అలీ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరికీ కన్నీరు పెట్టిస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  టాప్ తీసేసి షాకిచ్చిన పూనమ్ బజ్వా: అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేస్తూ.. ఓ రేంజ్‌లో చూపించిన హీరోయిన్

  ఎవరూ చెప్పుకోరు

  ఎవరూ చెప్పుకోరు

  సాధారణంగా సినిమాలు హిట్ కొట్టిన తర్వాత సినిమా నటుల గురించి ప్రేక్షకులకు తెలుస్తుంది. కానీ వారు జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించి ఆ స్థాయికి వచ్చారు అనే విషయం పెద్దగా ఎవరూ ప్రస్తావించుకోరు కూడా. ప్రస్తావించి ఉంటే సానుభూతి పొందడం కోసం అలా ప్రస్తావిస్తున్నారు ఏమో అనే అనుమానాలు వ్యక్తం చేసే రోజులివి.

  మంచు భక్తవత్సలం నాయుడు గా మద్రాస్ రైలెక్కిన మోహన్ బాబు చివరికి మోహన్ బాబు గా మారి ఈరోజు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకునే క్రమంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన ఘటన గురించి కమెడియన్ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

  అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్.. మరోసారి అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్

  సోషల్ మీడియాలో వైరల్

  సోషల్ మీడియాలో వైరల్

  కమెడియన్ అలీ ఒకపక్క సినిమాలతో మరోపక్క టెలివిజన్ షోలతో బిజీగా ఉన్నారు. ఆలీతో సరదాగా డ్రామా, జూనియర్స్ షో లో పాల్గొంటూ ఆయన ప్రేక్షకులతో మమేకం అవుతున్నారు..ఇక డ్రామా జూనియర్స్ అనే షో జీ తెలుగులో ప్రసారం అవుతూ ఉండగా ఈ షోకి ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

  తనకు హీరోగా లైఫ్ ఇచ్చిన ఎస్ వి కృష్ణారెడ్డి తో కలిసి ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే షోకి సింగర్ సునీత కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే ఆగస్టు 15 తేదీన టెలికాస్ట్ అవ్వాల్సిన ఒక ఎపిసోడ్ కు చెందిన ప్రోమో తాజాగా విడుదల చేశారు.

  Bigg Boss OTT భామ నేహా భాసిన్.. మత్తెక్కించే అందాలతో హంగామా!

  వారికీ వీరికీ అదే తేడా

  వారికీ వీరికీ అదే తేడా

  ఈ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి హాజరయ్యారు. ఇక ఎప్పటిలాగే చిన్నారులు ఈ వేదికమీద తమదైన శైలిలో నటించి ఆనందింప చేశారు.. అయితే ఒక స్కిట్ లో మాత్రం స్టేజ్ ఆర్టిస్టులకు సినిమా ఆర్టిస్టులకు ఉన్న తేడా చూపిస్తూ ఒక స్కిట్ చేశారు.

  ఈ స్కిట్ పూర్తయిన తర్వాత స్టేజ్ ఆర్టిస్టులందరూ కరోనా కారణంగా తాము ఎదుర్కొన్న కష్టాలు చెబుతూ పది కేజీల బియ్యం ఎవరు ఇస్తారు అని ఎదురు చూసిన రోజులు గుర్తు తెచ్చుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇక వాళ్లు మాట్లాడిన మాటలు విని జడ్జిగా హాజరైన వారేకాక ముఖ్యఅతిథిగా హాజరైన మంచు లక్ష్మి కూడా కన్నీరు పెట్టుకున్నారు.

  Adah Sharma బికినీ అందాలన్నీ ఒక్క చోట.. చిన్నప్పటి నుంచీ ఇప్పటిదాకా!

  తినే పళ్ళెంలో మలం

  తినే పళ్ళెంలో మలం

  షో కి పిలిచి ఏడిపించాలని అనుకున్నారో ఏమో తెలియదు గానీ అలీ కూడా వెంటనే ఎమోషనల్ అవుతూ మోహన్ బాబు గురించి ప్రస్తావించారు. మంచు లక్ష్మి తండ్రి మంచు భక్తవత్సలం నాయుడు గా మద్రాసులో కి నటుడిగా మారదామని వచ్చారని అయితే కొన్నాళ్ల పాటు ఎలాంటి అవకాశాలు లేక పోవడంతో నాలుగు నెలల పాటు ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలు ఎదుర్కొన్నారని వెల్లడించారు. అయితే ఎన్ని తిట్టినా ఇల్లు ఖాళీ చేయడం లేదనే ఉద్దేశంతో ఆయన తినే అన్నం ప్లేట్లో ఆ ఇంటి ఓనర్ మలం కూడా వేశారని వ్యాఖ్యానించారు. ఈ మాటలు విన్న అందరూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది.

  సాయి బాబా ఆలయ నిర్మాణం

  సాయి బాబా ఆలయ నిర్మాణం

  ఇక ప్రస్తుతానికి మోహన్ బాబు స్వయంగా చిత్తూరు జిల్లాలో ఒక సాయిబాబా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక తాజాగా ఈ ఆలయ నిర్మాణానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వంతు సాయంగా ఆర్థిక విరాళాన్ని ప్రకటించారు.

  గురువారం నాడు రంగంపేట సమీపంలో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద చేపడుతున్న ఈ ఆలయాన్ని మోహన్ బాబుతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో ఆలయంలో మార్బుల్ వేయడానికి అవసరమైన 17 లక్షల రూపాయలు చెవిరెడ్డి అందజేశారు.

  అంతేకాక ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని కూడా ప్రభుత్వం తరఫున అందిస్తానని ఆయన వెల్లడించారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు సినిమాల విషయానికి వస్తే ఆయన కీలక పాత్రలో సన్నాఫ్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది..

  Recommended Video

  Bullet Satyam Movie Trailer
  మరో అవకాశం

  మరో అవకాశం

  గతంలో మోహన్ బాబు తో ఒక సినిమాకి రచయితగా పనిచేసిన డైమండ్ రత్నబాబు ఆ తర్వాత బుర్రకథ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కానీ ఆ దర్శకుడికి మోహన్ బాబు మరో అవకాశం ఇచ్చారు తన సన్ ఆఫ్ ఇండియా సినిమాకు ఆయన దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోందని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ సినిమా ద్వారా మోహన్ బాబు మళ్లీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది.

  English summary
  Ali's words on a show about the insult to Mohan Babu are now bringing tears to everyone's eyes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X