twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆన్‌లైన్‌లో నితిన్ దర్శకుడికి టోకరా.. గుడ్డిగా నమ్మి డబ్బులు పంపిన దర్శకుడు.. చివరికి..

    |

    సైబర్ నేరగాళ్ల నుంచి వీలైనంత దూరంగా ఉండాలి అంటూ పోలీసులు నిత్యం ఎదో ఒక విధంగా వార్తల్లో చెబుతూనే ఉంటారు. అయినప్పటికీ కొందరు అనుకోని విధంగా మోసపోతున్నారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమి తెలియని వాళ్ళు మోసపోయారు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు సైబర్ నేరగాళ్ల వలన మోసపోవడం హాట్ టాపిక్ గా మారింది.

    సౌతిండియాలో ఐటమ్ గర్ల్స్‌ హీరోయిన్లు వీరే... గ్లామర్‌తో ఇరగదీస్తున్న బ్యూటీలు

    దర్శకుడికే సినిమా చూపించారు

    దర్శకుడికే సినిమా చూపించారు

    ఇక ఆ దర్శకుడు మరెవరో కాదు. ఛలో సినిమాతో బాక్సాఫీస్ హిట్టు కొట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వెంకీ కుడుముల. నితిన్ తో గత ఏడాది భీష్మ సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద హిట్ కొట్టాడు. ఆ రెండు సినిమాలతోనే వెంకీ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది. అయితే ఇటీవల ఈ దర్శకుడికి కొందరు దుండగులు సినిమా చూపించారు.

    66 వేలు డిపాజిట్ చేయించుకొని..

    66 వేలు డిపాజిట్ చేయించుకొని..

    వెంకీ కుడుములను నమ్మించి ఏకంగా 66వేల రూపాయలు డిపాజిట్ చేయించుకొని మోసం చేశారు. మరీన్ని డబ్బులు కూడా వేయాలని ఫోన్ కాల్స్ చాలానే వచ్చయట. కానీ దర్శకుడు డబ్బులు కట్టిన తరువాత మోసమని గ్రహించి. పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

    అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు భీష్మ అనగానే..

    అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు భీష్మ అనగానే..

    వివరాల్లోకి వెళితే.. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు మన సినిమా వెళుతోంది అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు దర్శక నిర్మాతలు. అయితే భీష్మ సినిమాను కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు నామినేట్ చేయనున్నట్లు ఫోన్ కాల్ రావడంతో దర్శకుడి ఎగిరి గంతేశాడు. ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా ఆరు కేటగిరీలలో సినిమాను నామినేట్ చేయనున్నట్లు వివరణ ఇవ్వడంతో ఈజీగా నమ్మేశారట.

     ఒక్కో కేటగిరీకి రూ.11వేలు

    ఒక్కో కేటగిరీకి రూ.11వేలు

    నేను ప్యానల్ సభ్యుల్లో ఒకడిని ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఉందని. మోసగాడు వివరణ ఇవ్వడంతో వెంకీ కూడా నమ్మేశాడు. ఇక ఒక్కో కేటగిరీకి 11వేల రూపాయల చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పడంతో దర్శకుడు వెంకీ మొత్తం 66 వేలు చెల్లిమెచ్చాడు.

    మరో కొత్త స్టోరీ చెప్పడంతో..

    మరో కొత్త స్టోరీ చెప్పడంతో..

    డబ్బులు చెల్లించిన అనంతరం సైబర్ నెరగడు మరోసారి ఫోన్ చేసి కొత్త స్టోరీ చెప్పాడు. మూడు కేటగిరీలకు సంబంధించిన నామినేషన్ విషయంలో మిస్టేక్ జరిగిందని అంటూ మరికొంత డబ్బులు కూడా చెల్లించాలని చెప్పాడు. ఇక ఫైనల్ గా అనుమానం రావడంతో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతలు దీని గురించి పట్టించుకోవద్దని అన్నారని విషయాన్ని దాట వేశాడు.

    కేసు నమోదు చేసిన దర్శకుడు

    కేసు నమోదు చేసిన దర్శకుడు

    పూర్తిగా అది సైబర్ నేరగాళ్ల మోసమని తెలుసుకున్న వెంకీ కుడుముల పోలీసులను ఆశ్రయించాడు. సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది జరిగిన మోసంపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు అతని నేరగాళ్లు చేసిన ఫామ్ నెంబర్ ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. వివరాలు సేకరీంచింది దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    English summary
    Police always say in the news that they should stay away from cyber criminals as much as possible. Yet some are unexpectedly deceived. And those who do not know what is in the film industry may think that they have been deceived. But cheating by a director with experience in both films by cyber criminals has become a hot topic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X