twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నారప్ప’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్: మరో గెటప్‌లో దర్శనమిచ్చిన వెంకటేష్

    |

    బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనలోని టాలెంట్లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు దగ్గుబాటి వెంకటేష్. విక్టరీనే ఇంటి పేరు పెట్టుకునేంతగా విజయాలను అందుకున్న ఆయన.. కొంత కాలం పాటు ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. అయితే, ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడీ సీనియర్ హీరో. 'గురు', 'F2', 'వెంకీ మామ' వంటి హ్యాట్రిక్ హిట్లను అందుకున్న ఆయన.. ప్రస్తుతం 'నారప్ప' అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ అయింది.

    తమిళంలో ధనూష్ హీరోగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం 'అసురన్'. దీనికి తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమే 'నారప్ప'. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నుంచి వెంకటేష్ రెండో గెటప్ అయిన యంగ్ లుక్‌ను మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే మిడిల్ ఏజ్‌కు సంబంధించిన లుక్‌తో వెంకటేష్ సందడి చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఇప్పుడు ఇందులోని మరో పాత్రకు సంబంధించిన ఫొటోనే వదిలారు. దీంతో దగ్గుబాటి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    Daggubati Venkatesh Naarappa Mahashivratri Special Poster Released

    ఇదిలా ఉండగా, 'నారప్ప' మూవీని సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్ లిమిటెట్, వీ క్రియేషన్స్‌ పతాకాలపై డీ సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి, రెబా జాన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను మే 14న విడుదల చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. దీనితో పాటు వెంకటేష్ 'F3' అనే సినిమాలోనూ నటిస్తున్నారు.

    బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఇక, ఈ మూవీ రిలీజ్ డేట్‌ను గురువారమే ప్రకటించారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌ అనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    English summary
    Daggubati Venkatesh is an Indian film actor known for his works predominantly in Telugu cinema. Venkatesh debuted with the 1986 film Kaliyuga Pandavulu for which he won his first Nandi Award. In a career spanning over 30 years, he starred in many successful films such as Bobbili Raja, Chanti, Intlo Illalu Vantintlo Priyuralu...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X