Don't Miss!
- News
పోలవరం నిర్వాసితులకు కేంద్రం బ్యాడ్ న్యూస్ ! నో డీబీటీ.. ఓన్లీ రీయింబర్స్ మెంట్ !
- Finance
Indian Economy: 5 ఏళ్లలో భారత్ అద్భుతాలు.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా.. ఎందుకంటే
- Sports
INDvsNZ : ఫ్యూచర్ ఇదే.. గిల్ను స్టార్ అంటూ మెచ్చుకున్న విరాట్ కోహ్లీ!
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Technology
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ధమాకా సక్సెస్ తో దర్శకుడికి బిగ్గెస్ట్ ఆఫర్.. అదిరిపోయే కాంబో సెట్ చేస్తున్న మైత్రి!
మాస్ మహారాజ రవితేజ నటించిన దమాకా సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటు రవితేజ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ సినిమా కేవలం రవితేజకు మాత్రమే కాకుండా దర్శకుడు అలాగే నిర్మాతలకు కూడా మంచి లాభాలను చేకూర్చింది అని చెప్పాలి.
ముఖ్యంగా దర్శకుడు త్రినాధ రావు నక్కిన రేంజ్ ను కూడా మరో లెవెల్ కు పెంచింది. అతని కెరీర్ లో ఇంతకుముందు సినిమా చూపిస్త మామ, నేను లోకల్ రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక త్రినాధ రావు మరో లెవల్ కు వెళ్లి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ధమాకా సినిమా అతనికి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు త్రినాధ రావుకు మైత్రి మూవీ మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలో చేయడానికి చాలామంది అగ్ర హీరోలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య వెంకటేష్ ఇలా నేటి తరం హీరోలు ఈ ప్రొడక్షన్స్ నుంచి అడ్వాన్స్ తీసుకుని సినిమా కథను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ప్రొడక్షన్ హౌస్ కూడా చాలా రకాల కథలు వింటోంది.

ఈ తరుణంలో ధమాకా డైరెక్టర్ కు కూడా వారు అడ్వాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం లైనప్ లో ఉన్న ఒక హీరో తో త్రినాథరావు తో ప్రాజెక్టును ఫైనల్ చేయాలని అనుకుంటున్నారు. ఇక త్రినాధరావు పూర్తి కథను సిద్ధం చేసుకున్న తర్వాత ఏ హీరో అయితే బాగుంటుందో ఆ హీరోకు చెప్పాలని అనుకుంటున్నాడట. మరి ఈ దర్శకుడు ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడో చూడాలి.