డైరెక్టర్‌గా ధనుష్ రెండో సినిమా ప్రారంభం.. కీలక పాత్రలో నాగార్జున!
విలక్షణ నటుడు, దర్శకుడు ధనుష్ డైరెక్టర్‌గా తన రెండో సినిమాను ప్రారంభించాడు. రాజ్ కిరణ్, రేవతీతో పా పాండీ తర్వాత తన రెండో చిత్రానికి గురువారం శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇంకా పేరుపెట్టని చిత్రానికి సంబంధించిన విశేషమేమిటంటే.. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కీలక పాత్రను పోషించడమే.

కొద్దిరోజుల క్రితం ధనుష్ హైదరాబాద్ వచ్చి చిరంజీవి, నాగార్జునకు కథను చెప్పారట. అయితే నాగార్జున ఈ చిత్రంలో ఒప్పుకోవడంతో ఆయనను ఫైనల్ చేయడం జరిగిందట. ఇంకా ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, అదితిరావు హైదరీ, శరత్ కుమార్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు. అదితికి ఈ చిత్రం తమిళంలో నాలుగోది.

ప్రస్తుతం ధనుష్ ఎన్నై నొక్కి పాయుమ్ తొట్ట, వడా చెన్నై చిత్రాల్లో నటిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న ఎన్నై నొక్కి పాయుమ్ తొట్ట దీపావళికి రిలీజ్ కానున్నది. వడా చెన్నై చిత్రం విడుదల వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











