ఫుల్ తాగేసి నాగార్జునతో గొడవ.. బయటపెట్టిన జగపతి బాబు
తెలుగు ప్రేక్షకుల్లో ఎనలేని ప్రేమ, అభిమానాన్ని సంపాదించుకున్నారు సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున, స్టార్ నటుడు జగపతి బాబు. నాగార్జున ఇప్పటికీ తన లుక్స్, స్టైల్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూనే వస్తోంది. జగపతి బాబు విభిన్న పాత్రలు పోషిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. ఇక జగపతి అక్కినేని నాగార్జునకు ఉన్న అతి కొద్ది మంది స్నేహితుల్లో ఒకరు. వీరిద్దరికి ఒక స్పెషల్ బాండ్ ఉంది. కానీ విషయాలో వీరిద్దరికి చెడింది. దాంతో చాలా కాలం మాట్లాడుకోలేదంట. ఇక అందుకు కారణం ఏంటి అనే దానిపై తాజాగా జగపతి బాబు స్పందించారు.
ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో టాక్ షోలకు ఎంతటి రెస్పాన్స్ దక్కుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలతో ఆయన చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇక తాజాగా జీ తెలుగులో టాలీవుడ్ ప్రముఖ హీరో, నటుడు జగపతి బాబుతో జయమ్ము నిశ్చయమ్ము విత్ జగపతి బాబు అనే టాక్ షోను ప్రారంభించారు. ఈ షో ప్రతి ఆదివారం సాయంత్రం 9 గంటలకు జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం కానుంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు.

జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి బాబు అనే టాక్ షోకు కింగ్ అక్కినేని నాగార్జున హాజరవ్వడం విశేషం. ఇటీవల ఇంటర్వ్యూల్లోనూ అక్కినేని నాగార్జున ఎక్కువగా కనిపిస్తూ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తన వ్యక్తిగత విషయాలను పంచుకునేందుకు జగపతి బాబు టాక్ షోకు హాజరయ్యాడు. నాగార్జునతో పాటు ఆయన అక్కయ్య నాగ సుశీల, అన్న వెంకట్ రత్నం కూడా ఈ టాక్ షోకు హాజరవడం విశేషం. ఈ సందర్భంగా జగపతి బాబు నాగార్జునకు తనకు మధ్య జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ప్రోమో ప్రకారం.. సిగ్గులేకుండా మాట్లాడే షో ఇది. నువ్వు నా గురించి షూటింగ్ లో ఉండి ఉండడు. గోవాలో వేరే డేట్ కు వెళ్లి ఉంటాడని చెప్పాంట అని నాగార్జునను జగపతి అడిగారు. అది నేను కాదు గుర్తు తెచ్చుకో నువ్వే దొరికిపోతావ్ అని నాగార్జున బదులిచ్చారు. ఇక అదంతా ఫ్రెండ్షిప్ అంటూ జగపతి బాబు సర్దేశారు. ఇక గతంలో ఒక సందర్భంగా ఇద్దరం తాగేసి గొడవ పడ్డామని జగపతి బాబు అన్నారు. ఆ తర్వాత నుంచి నువ్వు నన్ను మీ ఇంటికి పిలవడం మానేశావని జగపతి బాబు నాగార్జునతో అన్నారు. అలాగే చైతన్య పెళ్లికి కూడా పిలవలేదని చెప్పారు. అందుకు నాగార్జున అలా ఏం లేదు పిలిచానని అన్నాడు. ఏదో హడావుడిలో జరిగి ఉంటుందని బదులిచ్చారు.
నేను పిలవకపోయినా నువ్వు రావాల్సింది కదా, అప్పుడు మన బాండ్ కు మరింత విలువ ఉండేదని అన్నారు. కానీ అఖిల్ పెళ్లికి ముందుగా నన్నే పిలిచావు చాలా సంతోషంగా అనిపించిందని జగపతి బాబు అన్నారు. కానీ ఆరోజు చాలా కుదురుగా ఉన్నావని జగపతి బాబును సుశీల ప్రశంసించింది. అయితే ఇదొక పెద్ద ప్రాబ్లమా అంటూ నాగార్జున ప్రశ్నించారు. ఇది ప్రాబ్లమే కాదు. కానీ నువ్వే దాన్ని సమస్య చేస్తున్నావని నాగార్జునపై జగపతి బాబు మాట్లాడారు. ఇక నాగార్జున తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని ఈ టాక్ షోలో మాట్లాడారు. ఈ ఫుల్ ఎపిసోడ్ ఆగస్టు 17న ఆదివారం టెలికాస్ట్ కానుంది.


Click it and Unblock the Notifications











