twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామన్ సెన్స్ ఉండాలి.. తెలిస్తే రాయండి.. లేకపోతే మూసుకొండి.. మీడియాపై దిల్ రాజు ఫైర్

    |

    భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీకేయ 2 చిత్రం అంచనాలకు మించి వసూళ్లను నమోదు చేస్తున్నది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ వెర్షన్‌లో కూడా భారీ కలెక్షన్లను రాబడుతున్నది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో దిల్ రాజు పాండమిక్‌కు ముందు కార్తీకేయ మూవీని స్టార్ట్ చేసి ప్రస్తుతం అన్ని భాషల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకొన్న చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. వాస్తవానికి జూన్, జూలై నెలను చూసుకొంటే సినిమా పరిశ్రమ ఏమైపోతుందనే భయం కలిగింది. ఆగస్టు నెలలో బింబిసార గానీ, సీతారామం, కార్తీకేయ 2 ఊపిరిపోసింది. మాకు మంచి ఇన్స్‌పిరేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని దిల్ రాజు అన్నారు. ఈ సమావేశంలో దిల్ రాజు ఎమోషనల్ స్పందిస్తూ.. నేను కొన్ని మాట్లాడటానికి ఈ వేదిక కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ నిర్మాతల పర్మిషన్‌తో మాట్లాడుతాను. ఇప్పుడు మాట్లాడకపోతే నా మనసులో బాధ ఉంటుంది అని దిల్ రాజు ఆవేశంగా మాట్లాడారు. మాట్లాడుతూ..

     కార్తీకేయ సక్సెస్ మీట్‌లో

    కార్తీకేయ సక్సెస్ మీట్‌లో


    పాండమిక్‌కు ముందు కార్తీకేయ మూవీని స్టార్ట్ చేసి ప్రస్తుతం అన్ని భాషల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకొన్న చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. వాస్తవానికి జూన్, జూలై నెలను చూసుకొంటే సినిమా పరిశ్రమ ఏమైపోతుందనే భయం కలిగింది. ఆగస్టు నెలలో బింబిసార గానీ, సీతారామం, కార్తీకేయ 2 ఊపిరిపోసింది. మాకు మంచి ఇన్స్‌పిరేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని దిల్ రాజు అన్నారు. ఈ సమావేశంలో దిల్ రాజు ఎమోషనల్ స్పందిస్తూ.. నేను కొన్ని మాట్లాడటానికి ఈ వేదిక కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ నిర్మాతల పర్మిషన్‌తో మాట్లాడుతాను. ఇప్పుడు మాట్లాడకపోతే నా మనసులో బాధ ఉంటుంది అని దిల్ రాజు ఆవేశంగా మాట్లాడారు.

     కార్తీకేయ 2 రిలీజ్ గురించి

    కార్తీకేయ 2 రిలీజ్ గురించి


    మా బ్యానర్‌లో థ్యాంక్యూ సినిమాను జూలై 8న రిలీజ్ చేసుకొందామని అనుకొన్నాం. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను వివేక్ కూచిబొట్లకు కాల్ చేసి.. మా సినిమా రిలీజ్ వాయిదా వేసుకొంటున్నాం. మీరు కార్తీకేయ 2 సినిమాను రిలీజ్ చేయాలనునుకొన్న డేట్‌కు ఏమైనా మాకు అవకాశం ఇస్తారా? అని అడిగారు. ఆ తర్వాత నిఖిల్, చందూ మొండెటి మా ఇంటికి వచ్చి థ్యాంక్యూ సినిమాకు క్లాష్ వద్దు.. కార్తీకేయ 2 సినిమాను మరో డేట్‌కు రిలీజ్ చేసుకొంటామని చెప్పారు. దాంతో సమస్య ముగిసిపోయింది అని దిల్ రాజు అన్నారు.

    ఆగస్టు 5న అంటే.. వాయిదా వేసుకోమన్నా

    ఆగస్టు 5న అంటే.. వాయిదా వేసుకోమన్నా


    కార్తీకేయ 2 సినిమాను ఏ డేట్‌కు రిలీజ్ చేయాలని నన్ను అడిగితే.. మీరు ఏ డేట్‌కైనా పర్వాలేదు. నా వంతు సహాయం అందిస్తాను అని చెప్పాను. అయితే ఆగస్టు 5వ తేదీన రిలీజ్ చేస్తామని అంటే.. ఆ రోజు రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయని చెబితే.. మీరు ఆలోచించుకోండి అని చెప్పాను. దాంతో తమిళ సినిమా కోబ్రా రిలీజ్ వాయిదా పడటంతో 12 ఆగస్టు రిలీజ్ డేట్ అనుకొన్నారు అని దిల్ రాజు చెప్పారు.

    ఎవడికి తోచింది వాడు రాసేసుకొని..

    ఎవడికి తోచింది వాడు రాసేసుకొని..


    అయితే ఈ లోపు మీడియాలో ఎవడికి తోచింది వాడు రాసేసుకొన్నాడు. నిఖిల్ సినిమాను దిల్ రాజు తొక్కేస్తున్నాడు అని రాతలు రాశాడు. సినిమా ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు తొక్కుకోరు. అది రాసే వాళ్లకు, చదివే వాళ్లకు, వినే వాళ్లకు ఉండాల్సిన మినిమమ్ కామన్ సెన్స్. ఒక సినిమా ఆడితే మరో సినిమాకు ఊపిరిపోస్తుంది. కానీ మాలో మాకు విభేదాలు క్రియేట్ చేయడానికి, లేదా మీ క్లిక్కులు, సబ్ స్క్రైబర్స్ కోసం మమ్మల్ని బలిదానం చేయవద్దు. నా మీద చాలా ఇలాంటి రాతలు రాస్తుంటారు. ఎప్పడూ పట్టించుకోలేదు. చాలా ఓపిక పడుతుంటాను. నాకు ఎవరితో విభేదాలు పెట్టుకోవద్దని అనుకొంటాను అని దిల్ రాజు అన్నారు.

    నిఖిల్‌ను నేను తొక్కేస్తానా?

    నిఖిల్‌ను నేను తొక్కేస్తానా?


    నిఖిల్‌ను తొక్కడానికి నాకు ఏం పని. నిఖిల్ హ్యాపీ డేస్ నుంచి ఇప్పటి వరకు నేను ఎలా సపోర్ట్ చేశానో మాకు తెలుసు. కార్తీకేయ 2 సినిమాను ఆగస్టు 12 తేదీన రిలీజ్ చేయాలని అనుకొన్నప్పుడు.. మాచర్ల నియోజకవర్గం సినిమాతో క్లాష్ వద్దని 13 తేదీకి మార్చుకోమని చెప్పాను. వారు సరే అని 13వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించుకొన్నారు. ఈ లోపు ఎవడికి తోచింది వాడు రాసుకొన్నారు. పీపుల్స్ మీడియా ప్రస్తుతం ఎనిమిది సినిమాలు చేస్తున్నారు. అలాంటి వాళ్లను నేను తొక్కేస్తానా? కనీసం మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి. ఏదైనా విషయం తెలిస్తే క్లారిటీ తీసుకొని రాయాలి. అంతేగానీ క్లిక్స్ కోసం, దిల్ రాజు పేరు ఉంటే లింక్ క్లిక్ చేయరు అనే ఉద్దేశంతో తప్పుడు రాతలు రాస్తున్నారు అని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

    లేకపోతే మూసుకోండి అంటూ దిల్ రాజు

    లేకపోతే మూసుకోండి అంటూ దిల్ రాజు


    అయితే నేను తప్పు చేస్తే మీడియా ముందు క్షమాపణ కోరుతాను. ఒక్కటి గుర్తుంచుకొండి.. ఒక సినిమా కోసం ప్రాణం ఇస్తాను. ఒకరి సినిమా పాడు చేయాలని ఎప్పుడు అనుకోను. నేను బతికి ఉన్నంత కాలం సినిమా మంచి కోసమే ఉంటాను. కొన్నిసార్లు సినిమా నిర్మాతలు నష్టపోతారని తెలిసి కూడా నష్టాలను అనుభవించి సినిమాను రిలీజ్ చేస్తాను. మీకు తెలియకపోతే తెలిసి రాసుకొండి. లేకపోతే మూసుకోండి అంటూ ఓ వర్గం మీడియాపై దిల్ రాజు ఘాటుగా స్పందించారు. మీడియాకు ఎలాంటి అనుమానాలు ప్రశ్నలు ఉంటే.. వన్ టూ వన్ సమాధానం ఇస్తాను. అందుకు నేను ఎప్పుడంటే అప్పుడు సిద్దం అని దిల్ రాజు అన్నారు.

    English summary
    Karthikeya 2 Success Meet held at hyderabad after its going good at box office. In this function, Dil Raju contraversial Speech on Karthikeya 2 release conflict.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X