Don't Miss!
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- News
YS Avinash Reddy : అవినాష్ కు సీబీఐ ప్రశ్నలివే-2గంటలకు పైగా విచారణ-లాయర్ కూ నో ఎంట్రీ..!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Balagam: అజిత్‌ను తక్కువ చేసి మాట్లాడారా? దిల్ రాజు సమాధానం ఏమిటంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మతల్లో ఒకరైన దిల్ రాజు ఎస్విసి ప్రొడక్షన్ నుంచి మరో ప్రొడక్షన్ బ్యానర్ ఇండస్ట్రీలోకి రాబోతోంది. దిల్ రాజు ప్రొడక్షన్ DRP అనే ఈ సంస్థలో మొదటి సినిమాగా 'బలగం' తెరపైకి రాబోతోంది. ఈ సినిమాకు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈ సినిమాకు సంబంధించిన లోగో లాంచ్ నేడు జరుగగా ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా సినిమా గురించి వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమా ద్వారానే దిల్ రాజు కూతురు అన్షిత నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది.
అలాగే దిల్ రాజు సోదరుడు కుమారుడు హర్షిత్ రెడ్డి కూడా ఈ సినిమాతోనే మరొక నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన విషయాల గురించి దిల్ రాజు వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఈ బ్యానర్ అనుకున్నప్పుడు కొత్తవరకి అవకాశం కల్పించాలి అని ఆలోచనతోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యానర్ లో ఎక్కువగా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు రాబోతున్నాయి. అందులో ఫస్ట్ చేసిన సినిమా బలగం.

వేణు మొదట రెండు గంటలపాటు కథ చెప్పగానే చేసేస్తున్నాను అని చెప్పేసాను. ఈ సినిమా ఒక తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ లో సిరిసిల్ల విలేజ్ లో తెరకెక్కింది. నాచురల్ గా ఉండే విధంగా ఈ సినిమాను దర్శకుడు వేణు తెరపైకి తీసుకు వచ్చాడు. అలాగే అందుకు తగ్గ క్యారెక్టర్స్ ను టెక్నీషియన్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో లీడ్ పాత్రలో ప్రియదర్శి నటించాడు. అలాగే కావ్య హీరోయిన్ గా నటించింది. వీళ్లు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో కొత్తవారే నటించారు.
సినిమా పూర్తయింది సినిమా చూసిన తర్వాతనే ఈ బ్యానర్ ను కూడా ఎనౌన్స్ చేద్దామని ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఈ సినిమాకు బీమ్స్ మంచి మ్యూజిక్ కూడా అందించాడు. ఈ బ్యానర్ కు మంచి సినిమా అవుతుంది అని నమ్మకంతో చెప్పగలను. డబ్బుతో పాటు మంచి ప్రశంసలు కూడా వస్తాయి.. అని దిల్ రాజు అన్నారు.

అలాగే అజిత్ విజయ్ ల గురించి ఇటీవల చేసిన కామెంట్స్ పై కూడా దిల్ రాజు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మీరు అజిత్ ని తక్కువ చేసి మాట్లాడారు అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అని మీడియా అడిగిన ప్రశ్నకు దిల్ రాజు మాట్లాడుతూ.. మీడియా అనేది ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది కాకుండా ఈ బలగం సినిమా గురించి మాట్లాడదామని దిల్ రాజు చాలా సున్నితంగా ఆ విషయంపై వివరణ ఇచ్చారు.