Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
HBD Gunasekhar: గోన గన్నారెడ్డిపై గుణశేఖర్ క్లారిటీ.. ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం అంటూ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గుణశేఖర్ ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ సినిమాలను బాగానే తెరకెక్కించారు. అయితే ప్రస్తుత కాలంలో ఆయన నేటితరం దర్శకులకు తగ్గట్లుగా ఫామ్ లో కొనసాగలేకపోతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఆయన నుంచి మరిన్ని పవర్ఫుల్ సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. జన్మదినం జరుపుకొంటున్న దర్శకుడు గుణశేఖర్ తాజాగా గోనగన్నారెడ్డి పై కూడా మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఆయన చెప్పిన వివరాల్లోకి వెళితే...

టాప్ మోస్ట్ డైరెక్టర్ గా
ఒక్కడు సినిమాతో గుణశేఖర్ అప్పట్లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమాతో మహేష్ బాబు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. గుణశేఖర్ టాప్ మోస్ట్ డైరెక్టర్ గా క్రేజ్ కూడా అందుకున్నారు. అయితే ఆ విజయాన్ని ఆయన ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేకపోయాడు.

రుద్రమదేవి సినిమాలో..
ఇక చాలా కాలం తరువాత సొంత ప్రొడక్షన్ లోనే భారీగా ఖర్చు చేసి రుద్రమదేవి సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఓ మోస్తరుగా బాక్సాఫీస్ వద్ద నష్టాలు రాకుండా కాపాడింది. ఇక ఆ సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే.

గోన గన్నారెడ్డి మూవీ
అయితే ఆ సినిమా అనంతరం గోన గన్నారెడ్డి బయోపిక్ తీస్తే బావుంటుందని గుణశేఖర్ కు చాలామంది చెప్పారు. అభిమానుల నుంచి అలాగే మరికొంతమంది సినీ ప్రముఖుల నుంచి కూడా ఒత్తిడి బాగానే పెరిగిందట. మొత్తానికి గుణశేఖర్ ఆ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాడు.
Recommended Video

నిర్మాతలు కూడా సిద్ధమే..
అల్లు అర్జున్ తో గోన గన్నారెడ్డి సినిమా చేద్దామని చర్చించినట్లు చెప్పాడట. అలాగే సినిమా కోసం ఎంత ఖర్చయినా నిర్మించడానికి ప్రొడ్యూసర్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఇక త్వరలోనే ప్రాజెక్ట్ కాంబినేషన్ పై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా గుణశేఖర్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ దర్శకుడు సమంతతో శాకుంతలం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.