twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Seetaramam ఆ సినిమాకు కాపీ కామెంట్.. హ్యాపీగా ఉందన్న డైరెక్టర్!

    |

    పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతి సంస్థ నుంచి వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కు రప్పించేలా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్ అందించింది. అలాగే హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

    ఇక సీతారామమ్ సినిమాకు సంబంధించిన కాపీ ఆరోపణలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమా అసలు కథ ఇంతకుముందే త్రివిక్రమ్ రాసిన సినిమా కథ నుంచి పుట్టుకొచ్చింది అని కూడా ఎన్నో కథనాలు వైరల్ అయ్యాయి. అయితే మొదటిసారి దర్శకుడు ఆ ప్రశ్నలకు తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను అసలు కథను చాలా ఏళ్ల క్రితమే రాసుకున్నట్లు చెబుతూ కొంచెం కొంచెంగా ఆ కథను డెవలప్ చేసుకున్నట్లు తెలియజేశాడు.

    Director hanu raghavapudi clarifications on seetaramam movie copy allegations

    అయితే ఈ క్రమంలో మల్లీశ్వరి సినిమాలోని కొన్ని డైలాగ్స్ సీతారామన్ సినిమాకు చాలా దగ్గరగా ఉన్నాయని ముఖ్యంగా హీరో హీరోయిన్ ని బాగా చూసుకుంటాను అని చెప్పే విధానంతోపాటు ఆమె యువరాణిగా కనిపించడం వంటి అంశాలు కూడా మల్లీశ్వరి కథకు దగ్గరగా ఉన్నాయి అని చాలా రకాల మీమ్స్ అయితే వచ్చాయి. అయితే ఆ విషయంలో దర్శకుడు ఈ సినిమా ఆ అంశాలను పాత సినిమా మిస్సమ్మ నుంచి తీసుకున్నవి అంటూ.. అయితే ఈ రకాల మీమ్స్ పై మాత్రం అప్సెట్ అవ్వలేదని ఇంకా సంతోషంగా ఉంది అంటూ అలా వీడియోలు చేసిన వారి క్రియేటవీటిని కూడా మెచ్చుకోవాలి అని అన్నాడు. కాకపోతే నేను రాసిన డైలాగ్స్ అక్కడ సన్నివేశానికి తగ్గట్టుగా ఉన్నాయని వాటిని అంతకంటే మెరుగ్గా మరొక విధంగా రాయలేము అని కూడా హను వివరణ ఇచ్చాడు. ఏదేమైనా కూడా అంత మంచి సినిమాతో తన సినిమాను దగ్గరగా పోల్చి చూడడం మంచిదే అని.. ఒక విధంగా దాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారని కూడా అనుకుంటున్నట్లు హను రాఘవపూడి తెలియజేశాడు.

    English summary
    Director hanu raghavapudi clarifications on seetaramam movie copy allegations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X