Don't Miss!
- News
భయం నా బయోడేటాలోనే లేదు: నారా లోకేష్
- Finance
Pharma Mutual Funds: ఫార్మా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి ఇదే సరైన సమయమా..!
- Sports
INDvsNZ : ఇదేం బౌలింగ్రా.. నువ్వే వాళ్లను గెలిపిస్తున్నావ్.. టీమిండియా పేసర్‌పై ట్రోల్స్!
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
Pawan Kalyan హరీష్ శంకర్ సినిమా కోసం రంగంలోకి ప్రభాస్ దర్శకుడు.. అతని ఆలోచనతోనే స్క్రిప్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదియుడు భగత్ సింగ్ అనే సినిమా చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించి చాలా కాలమైంది. అయితే కొన్నాళ్లకు ఆ సినిమా స్క్రిప్ట్ పై నమ్మకంగా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేశాడు. అయితే ఇప్పుడు అదే కాంబినేషన్లో మరొక స్క్రిప్ట్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అది కూడా తేరి రీమేక్ అని తెలుస్తోంది. అఫీషియల్ గా ఎలాంటి వివరణ ఇవ్వలేదు కానీ ఇండస్ట్రీలో వారి సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం విజయ్ తమిళ మూవీ తేరీ కథకు రీమేక్ రాబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వస్తోంది.
ఇక సోషల్ మీడియాలో అయితే ఫాన్స్ మాత్రం ఆ రీమేక్ అసలు వద్దు అని ఒక ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఆ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే సినిమా మాత్రం తప్పకుండా త్వరలోనే మొదలవుతుంది అని హరిష్ శంకర్ వివరణ ఇచ్చాడు. నేడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ను అతను హరిహర వీరమల్లు సెట్స్ లో కూడా కలిశాడు.

ఇక అలాగే హరీష్ శంకర్ 'లవ్ యూ రామ్' అనే ఒక సినిమా టీజర్ లాంచ్ కు వెళ్లగా అక్కడ పవన్ కళ్యాణ్ సినిమాపై ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశాడు. ప్రముఖ సీనియర్ దర్శకుడు రచయిత దశరథ్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం కూడా వర్క్ చేస్తున్నట్లు చెప్పాడు. లవ్ యు రా అనే సినిమాకు దశరథ్ సహనిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే ఆయన కోసం టీజర్ లాంచ్ కి వెళ్ళిన హరిష్ శంకర్ ఈ విషయాన్ని తెలియజేశాడు.
ఇక దర్శకుడు దశరథ్ గతంలో నాగార్జునతో సంతోషం ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత అతను డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఈ దర్శకుడు చివరగా 2016లో మంచు మనోజ్ తో శౌర్య అనే సినిమా తీశాడు. ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. మళ్ళీ ఆ తర్వాత అతనికి ఎలాంటి అవకాశాలు రాలేదు. ఇక ఇప్పుడు హరిష్ శంకర్ సినిమాకు రైటర్ గా వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అతని పనితనం సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.